"అరిస్టాటిల్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గాలు చేర్పు)
ట్యాగు: 2017 source edit
 
==రచనలు==
ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంథం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్, యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ఠ తెచ్చి పెట్టింది.
 
అరిస్టాటిల్ రాజనీతిని ఒక సహజ శాస్త్రంగా రూపొందించినాడు. తాను వ్రాసిన '''పాలిటిక్స్'''లో రాజకీయజీవితం స్వభావాన్ని చర్చించాడు.రాజ్యము సహజమైన సంస్థ. దానిని ఏ ప్రజా సముదాయమూ ప్రత్యేకంగా ఒక ప్రయోజన సాధనకు ఒకానొక ప్రత్యేక కాలంలో రూపొందించలేదు. అరిస్టాటిల్ మానవుడిని సాంఘిక జీవి అని నిర్వచించాడు.రాజ్యము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది.అది వ్యక్తికి పూర్వమే జనించింది.రాజ్యంలో రెండు వర్గాల ప్రజలుంటారు.ఒకటి పాలకులు, రెండు పాలితులు.ఈ రెండు వర్గాల మధ్య సహజమైన సమైక్యత ఉండాలి. లేకపోతే ఈ రెండు వర్గాలు జీవించడం కష్టము.తెలివితేటలు, దూరదృష్టి ఉన్నవాళ్ళు రాజ్యపాలన వహిస్తారు.శారీరిక శక్తి ఉన్నవాళ్ళు పాలక వర్గం నిర్దేశించినట్లు పని చేస్తారు.రాజకీయ వ్యవస్థను ప్రజలు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేటట్లు రూపొందించాలి. రాజ్య ధ్యేయాలు మితంగా, ఆచరణ యోగ్యంగా ఉండాలి అంటాడు అరిస్టాటిల్. [[ప్లేటో]] '''ది లాస్''' లో ప్రతిపాదించిన చట్టబద్దమైన రాజ్యాన్ని అంటె ఉత్తమ రాజ్యం లో చట్టానికి సార్వభౌమాధికారం ఉంటుంది కానీ వ్యక్తికి కాదు అనే ప్రతిపాదనను అరిస్టాటిల్ అంగీకరించాడు.చట్టం మానవ బలహీనతలకు సదుపాయంగా అరిస్టాటిల్ భావించలేదు.అందువల్ల అది ఆదర్స రాజ్యంలో ప్రధానభాగం అవుతుంది.చట్టం పాలకులకు పాలితులకు మధ్య సంబంధాలను స్వేచ్చాయుత ప్రజలమధ్య సంబంధాలుగా నైతిక సమానత్వాన్ని ఏర్పరుస్తుంది. రాజ్యాంగ బద్ధమైన పాలన అనేది రాజ్యాన్ని మంచి పరిపాలకులు పరిపాలించేలా, లేదా మంచి చట్టాల ద్వారా పాలన జరిగేలా అనే అంశాన్ని కూడా చర్చనీయంగా చేస్తుంది అంటాడు అరిస్టాటిల్.
 
అరిస్టాటిల్ ప్రభుత్వాలను గణాత్మకంగానూ, గుణాత్మకంగానూ ఆరు రకాలుగా వర్గీకరించాడు.అవి రాజరికము, శ్రేష్ఠ జనుల పాలన (Aristocracy), పాలిటీ (Polity), క్రూర జనుల పాలన (Tyranny), అల్పజన పాలన (Oligarchy), ప్రజాస్వామ్యము. ఇందులో మొదతి మూడు చట్టబద్దమైనవి, చివరి మూడూ వికృత రూపాలు. ఇందులో అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు రకాలుగా వర్గీకరించాడు.అవి: అధికారాన్ని నిర్వహించేవారి సంఖ్యనుబట్టి ఏర్పడినవి.వాటిలో-ఒక వ్యక్తి పాలన లేదా ఏకస్వామ్యము, శ్రేష్ఠజనుల పాలన-కొద్దిమంది పాలన, పాలిటీ-అధిక సంఖ్యుల పాలన . రాజరికము, శ్రేష్ఠజనుల పాలన, పాలిటీ-వీటిలో అధికారం మొత్తం ప్రజల శ్రేయస్సుకై వినియోగించడం జరుగుతుంది. అధికారాన్ని స్వప్రయోజనం కోసం వినియోగించినప్పుడు రాజరికము క్రూరపాలన, శ్రేష్ఠ జనుల పాలన, అల్పజనుల పాలన , పాలిటీ, ప్రజాస్వామ్యం అవుతాయి అంటాడు అరిస్టాటిల్.
 
ప్రజాస్వామ్యంలో అందరికీ సమానత్వం ఉంటుంది. ధనవంతులు, నిరుపేదలు అన్నతేడా ఉండదు.గుణవంతులు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానులు.ఈ ప్రజాస్వామ్యంలో తలలనే లెక్క పెడతారు కాని, అభిప్రాయానికి విలువ ఉండదు.అందువల్ల ప్రజాస్వామ్యం అల్ప సంఖ్యాకులకు, గుణవంతులకు, అధిక సంఖ్యాకులు కలిసినప్పుడు సమానత్వం అనే సూత్రం క్రింద అధిక సంఖ్యాకులనే రోడ్డురోలర్ క్రింద అల్ప సంఖ్యాకులు నలిగిపొతారు.అజ్ఞానులు గుణవంతులపై ఘనవిజయం సాధిస్తారు అంటాడు అరిస్టాటిల్. ప్రజాస్వామ్యం రెండు రకాలు.రాజ్యాంగబద్దమైనది, రాజ్యాంగబద్దంకానిది.రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొన్ని చట్టాలు, పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది. ఇందులో అల్ప సంఖ్యాక వర్గాలు, వారి హక్కులు రక్షించబడుతాయి.రాజ్యాంగబద్దంకాని దానిలో మూక పాలన (Monarchy) లో ఇటువంటి రక్షణలు ఉండవు అంటాడు అరిస్టాటిల్.
 
అరిస్టాటిల్ మితవాది.అతడు ఆచరణ సాధ్యమైన భావాలనే రూపొందించాడు.సమస్యలను పరిష్కరించడంలో మధ్యే మార్గాన్ని లేదా మితవాద మార్గాన్ని అవలంబించాడు.దీనిని అనుసరించే రాజ్యంలో ఏ రెండు ప్రబల వర్గాలకీ చందని మధ్య తరగతి మరొకటి ఉంది.ఈ వర్గం ధనిక పేద వర్గాల మధ్య సమతా స్థితిని నెలకొల్పుతుంది.రెండు ప్రబల వర్గాల మధ్య ప్రాబల్యసమతౌల్యాన్ని ఏర్పాటిచేస్తుంది.అరిస్టాటిల్ మధ్యతరగతి ప్రజల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని భావించాడు.
 
==పరిశోధనలలో లోపాలు==
* బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని [[గెలీలియో]] ఋజువు చేశాడు.
686

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022667" నుండి వెలికితీశారు