సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జానపద చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 73:
 
==కథాసంగ్రహం==
స్త్రీ వ్యామోహం వల్ల మంతశక్తులన్నీ కోల్ఫోయిన మాంత్రికుడొకడు తన మనోరథ సిద్ధికై ఆదిత్యపురపు యువరాణి అపూర్వ చింతామణికి ఆచార్యస్థానాన్ని సంపాదిస్తాడు. తన చతురోపాయం వల్ల చింతామణిని పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటాడు. యుక్త వయస్కురాలైన చింతామణి వివాహ విషయాన్ని ఆధారంగా చేసుకుని తన అమానుషమైన శిరచ్ఛేద కార్యక్రమానికి పూనుకొని చింతామణిని వరించ వచ్చినవారికి విషమ సమస్యను సృష్టిస్తాడు. అతిలోక సుందరియైన అపూర్వ చింతామణి అందానికి ఆకర్షితులై అనేకమంది రాజకుమారులు ఆమెను వరించడానికి వచ్చి తమ శిరస్సులను అర్పిస్తూ వచ్చారు. ఇలా శిరస్సులను సమర్పించిన 999 మందిలో కైవల్యపుర రాకుమారు ఆరుగురు కూడా ఉన్నారు. ఈ విషయం ఏడవవాడైన ప్రతాపశీలునకు చాలాకాలం వరకూ తెలియకుండా మభ్యపెడతారు. ఒకనాడు ప్రసంగవశాన ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతాపశీలుడు తల్లిదండ్రులను ఒప్పించి తన అన్నల దుర్మరణానికి కారకురాలైన ఆ హంతకిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన సహచరుడైన కాళితో కలిసి ఆదిత్యపురానికి వెళతాడు.
 
==పాటలు==