బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 20:
imdb_id = |
}}
'''''బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్''''' 2008 లో వచ్చిన [[తెలుగు]] కామెడీ డ్రామా చిత్రం. [[అల్లరి నరేష్]], [[కృష్ణ భగవాన్]], [[ఫర్జానా|ఫర్జనా]], [[ చారులత|చారులత]], [[రఘుబాబు|రఘు బాబు]], [[సుమన్ శెట్టి]], [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస రావు]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[ శ్రీనివాస రెడ్డి (దర్శకుడు)|శ్రీనివాస రెడ్డి]] దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిరి సినిమా బ్యానర్‌లో కనుమిల్లి అమ్మిరాజు నిర్మించాడు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్ 18 న విడుదలైంది.
 
== కథ ==
{{మొలక-తెలుగు సినిమా}}
బొమ్మన బ్రదర్స్ ([[కృష్ణ భగవాన్|అల్లరి]] [[అల్లరి నరేష్|నరేష్]], [[కృష్ణ భగవాన్]]) వృత్తిరీత్యా దొంగలు. వారి తల్లిదండ్రులు ([[తనికెళ్ళ భరణి]], [[కోవై సరళ]]) దొంగతనాలు చేయమని వారిని ప్రోత్సహిస్తారు. ఒకసారి, ఈ బొమ్మన బ్రదర్స్ ఒక బ్యాంక్ మేనేజర్ ( [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం|ధర్మవరపు సుబ్రమణ్యం]] ) ను దోచుకొని డబ్బుతో తప్పించుకుంటారు. చివరికి వారు పోలీసులకు చిక్కి, వారి తండ్రి సహాయంతో పోలీసుల నుండి కూడా తప్పించుకుంటారు. అప్పుడు, వారు అనుకోకుండా ఇద్దరు సోదరీమణుల ఫోటోలను చూసి వారి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. వారు సిరి చందన ( [[ఫర్జానా]] ), మణి చందన ( [[ చారులత|చారులత]] ) అనీ, వారిద్దరూ ప్రసిద్ధ వస్త్ర వ్యాపారాల యజమాని మోహనరావు ( [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస రావు]] ) కుమార్తెలనీ తెలుసుకుంటారు.
 
సిరికి దేవుడంటే భక్తి. మణి ఎప్పుడూ అనాథలకు, అంగవికలురకూ సహాయం చేస్తూంటుంది. బొమ్మన బ్రదర్స్ వారి వేషధారణలను మార్చుకుని మణి, సిరి లను మోసం చేసి వారి హృదయాలను గెలుచుకుంటారు. కొన్ని మలుపుల తరువాత, బొమ్మన బ్రదర్స్ చందన సోదరీమణులను వివాహం చేసుకుంటారు. తరువాత, బొమ్మన బ్రదర్స్ మరికొన్ని ఎత్తులు వేసి మామగారి ఆస్తిని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే, వారు మోసగాళ్ళు అని తెలిసి మోహనరావు పిచ్చివాడౌతడు. ఇది మణి, సిరి లకు తీవ్రంగా కోపం వస్తుంది. తమ భర్తలను హత్య చేయడానికి ప్రొఫెషనల్ కిల్లర్ ( [[రఘుబాబు|రఘు బాబు]] ) ను మాట్లాడుతారు . దీనికి ముందే బ్రదర్స్ వారి తప్పును గ్రహించి, అస్తి పత్రాలను అందజేయడానికి అక్కాచెల్లెళ్ళను కలవడానికి ప్రయత్నిస్తారు. విలన్లతో పోరాటం తరువాత, సోదరులు ఆ పత్రాలను అప్పగించి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మోహన రావు బాగవడం, బ్రదర్స్ నిజాయితీగల జీవితాన్ని గడపడంతో సినిమా ముగుస్తుంది.
 
== తారాగణం ==
 
* [[అల్లరి నరేష్]], [[కృష్ణ భగవాన్]] (బొమ్మన సోదరులు)
* సిరి [[ఫర్జానా|చందనగా ఫర్జానా]], మణి చందనగా [[ చారులత|చారులత]] (చందన సోదరీమణులు)
* బొమ్మన బ్రదర్స్ తల్లిదండ్రులుగా తనికెళ్ళ [[తనికెళ్ళ భరణి|భరణి]], [[కోవై సరళ]]
* మోహన్ రావుగా [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస]] రావు
* కనకం పాత్రలో [[రజిత]]
* బ్యాంక్ మేనేజర్‌గా [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం|ధర్మవరపు సుబ్రమణ్యం]]
* ప్రొఫెషనల్ కిల్లర్‌గా [[రఘుబాబు|రఘు బాబు]]
* సేవకుడిగా [[సుమన్ శెట్టి|సుమన్ సెట్టీ]]
* [[సత్యం రాజేష్]] సత్యం
 
== పాటలు ==
{{tracklist|headline=|length3=04:41|length5=03:20|extra5=జస్సీ గిఫ్ట్, మాలతి|title5=నేను రెడీ|length4=03:51|extra4=కార్తిక్, కౌసల్య|title4=వానొస్తే వర్షాకాలం|note3=|extra3=టిప్పు, కల్పన|extra_column=గాయనీ గాయకులు|title3=మాయమాయగా|length2=05:00|extra2=శ్వేత, కార్తిక్|title2=పొద్దున్నేమో ఓసారి|length1=04:08|extra1=సుజిత్|title1=ఇశాకపట్నం, భీమిలీ|total_length=21:00|note5=}}
 
== సమీక్షలు ==
ఈ చిత్రానికి మంచి సమీక్షలు వచ్చాయి. CineGoer.com 3/5 రేటింగు ఇచ్చింది. "పక్కా కామెడీ, పైసా వసూల్ సినిమా. క్లైమాక్స్‌కు వచ్చే వరకు సమయం పరిగెడుతుంది " <ref>{{వెబ్ మూలము|url=http://www.cinegoer.com/reviews/bbcs+review.htm|title=BBCS Review - Fun Summertime Watch|publisher=CineGoer.com|accessdate=18 April 2008}}</ref>
 
== మూలాలు ==
<references />