కందులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
విస్తరణ
పంక్తి 15:
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) Millsp.
}}
కందులు ([[ఆంగ్లం]] Pigeon pea; [[లాటిన్]] ''Cajanus cajan'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి. [[భారతీయుడు|భారతీయు]]ల [[ఆహారం]]లో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు. '''కందులు''' <ref name="GRIN">{{GRIN|accessdate=2019-05-19}}</ref><ref>{{వెబ్ మూలము}}</ref> [[ఫాబేసి]] కుటుంబానికి చెందిన పప్పుదినుసు. కనీసం 3,500 సంవత్సరాల క్రితం [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలో]] పెంచడం మొదలు పెట్టినప్పటి నుండి, దాని విత్తనాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సాధారణ [[ఆహారం|ఆహారంగా]] మారాయి. దీన్ని [[దక్షిణాసియా|దక్షిణ ఆసియాలో]] చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. భారత ఉపఖండంలోని జనాభాకు [[మాంసకృత్తులు|ప్రోటీన్]] యొక్క ప్రధాన వనరు ఇది. ఇది బియ్యం లేదా [[రోటి|రోటీ]] (ఫ్లాట్ బ్రెడ్) తో కలిపి తినే దినుసుల్లో ఇది ప్రధానమైనది. భారతదేశం అంతటా దీన్ని [[ప్రధానాహారం|ప్రధానమైన ఆహారం]]<nowiki/>గా వినియోగిస్తారు.
[[దస్త్రం:Pigeon peas2.jpg|thumb|right|200px|ట్రినిడాడ్, టుబాగోలో లభించే కందులు]]
[[File:Cajanus cajan MHNT.BOT.2015.2.47.jpg|thumb|200px|''Cajanus cajan'']]
 
== చరిత్ర ==
కందులు ([[ఆంగ్లం]] Pigeon pea; [[లాటిన్]] ''Cajanus cajan'') [[నవధాన్యాలు|నవధాన్యాల]]లో ఒకటి. [[భారతీయుడు|భారతీయు]]ల [[ఆహారం]]లో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు.
కంది సాగు కనీసం 3,500 సంవత్సరాల నాటిది. దీనికి మూలం బహుశా ద్వీపకల్ప భారతదేశం. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో దీనికి దగ్గరి చుట్టాలు ''కాజనస్ కాజనిఫోలియా'' ) ఉన్నాయి. <ref>Van der Maeson, L. J. G. (1995). "Pigeonpea ''Cajanus cajan''", pp. 251–5 in Smartt, J. and Simmonds, N. W. (eds.), ''Evolution of Crop Plants. Essex'': Longman.</ref> 3,400 సంవత్సరాల క్రితం (14 వ శతాబ్దం BC) కు కంద ఉండేదని డేటింగ్ ద్వారా తెలుస్తోంది. [[నవీన శిలా యుగం|కొత్త రాతియుగ]] స్థలాలైన కర్ణాటక లోని [[గుల్బర్గా జిల్లా|కలుబురిగి]], దాని సరిహద్దు ప్రాంతాల్లో ([[మహారాష్ట్ర]] లోని [[తుళజాపుర|తుల్జాపూర్ గర్హి]], ఒరిస్సాలో [[ గోపాల్పూర్, ఒడిశా|గోపాల్పూర్]]) ఇవి కనిపించాయి. కేరళలో దీనిని తోమారా పారు అని పిలుస్తారు. <ref>{{Cite journal|last=Fuller|first=D. Q.|last2=Harvey|first2=E. L.|year=2006|title=The archaeobotany of Indian pulses: Identification, processing and evidence for cultivation|journal=Environmental Archaeology|volume=11|issue=2|pages=219–246|doi=10.1179/174963106x123232|pmc=|pmid=}}</ref> భారతదేశం నుండి ఇది తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలకు ప్రయాణించింది. అక్కడే మొదటగా దీనిని యూరోపియన్లు కనుగొన్నారు. వారు దీనికి కాంగో పీ అనే పేరు పెట్టారు. బానిస వ్యాపారం ద్వారా బహుశా 17 వ శతాబ్దంలో ఇది అమెరికా ఖండానికి వచ్చింది. <ref>Carney, J. A. and Rosomoff, R. N. (2009) ''In the Shadow of Slavery. Africa’s Botanical legacy in the Atlantic World''. Berkeley: University of California Press</ref>
{{నవధాన్యాలు}}
[[File:కందిపప్పు.JPG|thumb|right|కందిపప్పు]]
 
== ఉత్పత్తి ==
ప్రపంచ కంది ఉత్పత్తి 4.49 మిలియన్ టన్నులు. <ref name=":0">{{వెబ్ మూలము|url=http://www.fao.org/faostat/en/#home|title=FAOSTAT}}</ref> ఈ ఉత్పత్తిలో 63% భారతదేశం నుండే వస్తుంది. ఆఫ్రికా కంది ఉత్పత్తికి ద్వితీయ కేంద్రం. ప్రస్తుతం ఇది 1.05 మిలియన్ టన్నులతో ప్రపంచ ఉత్పత్తిలో 21% తోడ్పడుతుంది. మలావి, టాంజానియా, కెన్యా, మొజాంబిక్, ఉగాండాలు ఆఫ్రికాలో ప్రధాన ఉత్పత్తిదారులు.
 
కంది పండించే మొత్తం విస్తీర్ణం 5.4 మిలియను హెక్టార్లు అని అంచనా వేసారు. <ref name=":02">{{వెబ్ మూలము|url=http://www.fao.org/faostat/en/#home|title=FAOSTAT}}</ref> 3.9 మిలియన్ హెక్టార్లు లేదా 72% తో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.
 
== ఆహారంలో కంది ==
[[దస్త్రం:Tur_Dal.JPG|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Tur_Dal.JPG|alt=|ఎడమ|thumb|కంది పప్పు. భారతదేశంలో రోజువారీ ప్రధానాహారమైన పప్పును తయారు చేయడానికి ఉపయోగిస్తారు ]]
భారతదేశంలో, కంది పప్పును ''తూర్'' అని (तूर) [[మరాఠీ భాష|మరాఠీ]], ''కందిపప్పు [[పప్పు]]'' (तूर दाल) లేదా 'అర్హర్' ([[హిందీ భాష|హిందీ]]), కేరళలో తువర పరిప్ప అని, క్న్నడంలో ''తొగరి'' ''బెలే'' అని తమిళంలో ''తువరం పరుప్పు'' అనీ అంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాల్లో ఇదొకటి. ఎక్కువగా శాకాహారంలో ప్రోటీన్ కు ముఖ్యమైన వనరు ఇది. [[ఇథియోపియా|ఇథియోపియాలో]], కాయలు మాత్రమే కాకుండా, లేత రెమ్మలు, ఆకులు కూడా ఉడికించి తింటారు. <ref>Zemede Asfaw, [http://www.bioversityinternational.org/publications/Web_version/500/ch08.htm "Conservation and use of traditional vegetables in Ethiopia"] {{Webarchive|url=https://web.archive.org/web/20120707210646/http://www.bioversityinternational.org/publications/Web_version/500/ch08.htm|date=2012-07-07}}, ''Proceedings of the IPGRI International Workshop on Genetic Resources of Traditional Vegetables in Africa'' (Nairobi, 29–31 August 1995)</ref>
 
{{నవధాన్యాలు}}
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:ఆహార పంటలు]]
 
{{మొలక-వ్యవసాయం}}
"https://te.wikipedia.org/wiki/కందులు" నుండి వెలికితీశారు