అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: విస్తరణ
ట్యాగు: 2017 source edit
చిన్న చిన్న అక్షర దోషాల సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
== ఉద్యోగం ==
వివాహానంతరం ఈ సోదరులు ఉద్యోగ నిమిత్తం గోల్కొండ రాజధానియగు హైదరాబాదుకు వెళ్ళారు. అప్పటికి వీరి వయస్సు సుమారు 20 సంవత్సముల పైబడి ఉండవచ్చును. 1650 ప్రాంతంలో కొంత ప్రయత్నం మీదట మీర్జా మహమ్మద్ సయీద్ మీర్జుమ్లా వద్ద భూమి ఆదాయ శాఖలో గుమాస్తాలుగా ఉద్యోగంలో కుదురుకున్నారు. తర్వాత తమ తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. 1656లో మీర్ జుమ్లా చేసిన తిరుగుబాటులో వీరు పాల్గొనలేదు కాబట్టి వీరి ఉద్యోగాలు అలానే ఉన్నవి. ఈ ప్రస్థానంలో వీరు ఇద్దరూ సయ్యదసయ్యద్ ముజఫర్ అనే పర్షియన్ మూలాలున్న అధికారి దగ్గర పనిచేసేవారు. ముజఫర్ అబుల్ హసన్ ను గద్దె నెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ వీరు తెలివిగా ముజఫర్ ను అతని ఇంట్లోనే బంధించి ఖజానాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.<ref>S. Krishnaswami Aiyangar, "Abul Hasan Qutub Shah and his Ministers, Madanna and Akkanna." Journal of Indian History (August 1931): 91-142.</ref>ఖజానా అధికారిగా మరింత బాగా బలపడి గోల్కొండ సామ్రాజ్యంలో అన్ని వ్యవహారాలు తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకున్నాడు. అందుకు అతని సోదరులు అక్కన్న, మేనల్లుడు రూస్తంరావులు సహకరించారు. ఆయన చనిపోయేవరకు ఇలాగే కొనసాగింది. అక్కన్న కొంచెం తక్కువ ప్రాధాన్యం కలవాడైనా సైన్యాధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఆ ఉద్యోగంలో అతను స్వయంగా సేనలను నడిపించకపోయినా యుద్ధ ప్రణాళికలు రూపకల్పన చేసేవాడు.
 
== మరణం ==
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి తలలను ఔరంగజేబు కుమారుడైన షా ఆలం దగ్గరకు పంపారు. అతడు వాటిని షోలాపురంలోన్మున్నషోలాపురంలోనున్న ఔరంగజేబు దగ్గరికి పంపాడు. అతడు వాటిని ఏనుగుల చేత తొక్కించి గోలకొండ కోట ఇక తమకు వశమైనట్లేనని సంబర పడ్డాడు. వీరి మరణంతో తానీషా మిక్కిలి దుఃఖించాడు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.<ref>Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308</ref> తెలంగాణాలో వీరిని మంచి పాలకులుగానూ, అమరులుగానూ కీర్తించబడుతున్నారు.<ref>K.V. Bhupala Rao, The Illustrious Prime Minister Madanna. Hyderabad, [1984].</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్కన్న_మాదన్న" నుండి వెలికితీశారు