తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== క్రీడలు ==
 
# '''[[తాడు ఆట]]:''' ప్రపంచవ్యాప్తంగా [[పిల్లలు]], పెద్దలు ఆడే [[ఆట]].ఇది ఒక రకమైన [[వ్యాయామం|వ్యాయామంగా]] చెప్పుకోవచ్చుఆడపిల్లలు దాదాపు తమ పొడవుగల తాడును చేతులతో తమకాళ్ల క్రిందనుంచి తలపైకిత్రిప్పుతూ, కాళ్లకు తగలకుండా గెంతుతుంటారు. అలా ఏకబిగిని ఎవరు ఎక్కువసార్లు త్రిప్పితే వారు గెలిచినట్లు.దీనితోనే మరొక ఆట కూడా ఆడతారు. పిల్లలందరూ ఒకే చోట ఒకేసారి ఇలా గెంతుతూ బయలుదేరి నిర్దేశించుకున్న స్థలానికి ఎవరు ముందు చేరితే వాళ్ళు గెలిచినట్టు.ఇది కాళ్ళకూ, చేతులకూ, ఏకాగ్రతకూ సంబంధించిన శారీరక శ్రమకు చెందిన ఆట. చక్కని పోటీ మనస్తత్వం, పురోగతిపై ఆకాంక్ష కలిగిస్తుంది ఈ ఆట.<ref>గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు, పడాల రామకృష్ణారెడ్డి, 1991, పేజీ: 397.</ref>
# '''దాగుడు మూతలు:''' దీనిని దొంగ - పోలీస్ ఆట ఇని కూడా అంటారు.ఇది [[పిల్లలు]] ఆడుకునే [[ఆట]]. ఇందులో ఆటగాళ్ళు చుట్టుపక్కల దాగుంటే, ఒకరు లేదా ఇద్దరు వారిని పట్టుకుంటారు. పట్టుబడిన వాడు/వారు తర్వాత దొంగగా మారి ఇతరులు దాగున్నవార్ని పట్టుకొంటూ ఆట కొనసాగుతుంది. దొంగ సాధారణంగా కళ్ళు మూసుకుని కొన్ని అంకెలు లెక్క పెట్టేలోగా మిగతా వాళ్ళు రహస్య స్థలాల్లో దాక్కోవాలి.దీని వలన పిల్లలలో మంచి బలం చేకూరుతుంది.
# దాడి ఆట''':''' '''ఆడే పద్ధతి''' ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న [[కోణం|కోణాలలో]] వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.