తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు: కూర్పుల మధ్య తేడాలు

తిరుమల సహస్ర దీపాలంకరణ పేజీ ఇక్కడ విలీనం
చి →‎రోజువారీ సేవలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: నాద → నాథ, ) → )
పంక్తి 14:
*'''కొలువు:''' తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. ''బలిబేరాని''కి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.
*'''సహస్రనామార్చన:''' ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. [[బ్రహ్మాండ పురాణం]] లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో '''మిరాశీదారు''' [[వరాహ పురాణం]] లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత ''నక్షత్ర హారతి'', ''కర్పూర హారతి'' ఇస్తారు.
*'''మొదటిగంట, నైవేద్యం:''' మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి ''పులిహోర'', ''పొంగలి'', ''దద్ధోజనం'', ''చక్కెర పొంగలి'' (అన్నప్రసాదాలు), ''లడ్లు'', ''వడలు'', ''అప్పాలు'', ''దోసెలు'', ''పోళీలు'' (పిండివంటలు) ''కులశేఖరపడి'' (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
*'''అష్టోత్తర శతనామార్చన:''' ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
*'''రెండో గంట, నైవేద్యం:''' అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
*సహస్ర దీపాలంకరణ: ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారు, సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో వేదపండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తారు. నాదస్వరవిద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోను, పురందర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు. వేద, నాదనాథ, గానాలను ఆలకిస్తూ, మలయప్పస్వామి మెల్లమెల్లగా ఉయ్యాలలూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
*'''రాత్రి కైంకర్యాలు:''' ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
*'''ఏకాంతసేవ:''' రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ''ముఖమంటపం''లో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని '''తాళ్లపాక వారి లాలి''' అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.