తిరువయ్యారు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: విధ్వాంసు → విద్వాంసు, → (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
website = |
footnotes = |
}}'''తిరువయ్యారు''' [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని పట్టణం. ఇది '''తిరువయ్యారు''' తాలూకాకు కేంద్రం. ఈ పురాతన చోళరాజ్య పట్టణం [[శ్రీత్యాగరాజస్వామి]] ఆలయానికి, ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికీ ప్రసిద్ధి గాంచింది. ఇది తంజావూరు నుండి 11 కి.మీ. ఉత్తరాన, కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యారు అంటే ఐదు నదుల పవిత్ర స్థలం అని అర్థం. వడవార్, వెన్నార్, వెట్టార్, జూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
 
కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన [[త్యాగరాజు|త్యాగయ్య]] తిరువయ్యారులో జన్మించాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాథనోత్సవాలు]] జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులుసంగీతవిద్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.
 
== ఆధ్యాత్మిక పట్టణం ==
ఇక్కడి శివాలయం లోని దేవుని పేరు పంచనదీశ్వరస్వామి. అమ్మవారి పేరు ధర్మసంవర్ధిని. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడున్న పంచనదీశ్వర స్వామి ఆలయం 60,000 చ.మీ. విస్తీర్ణంలో 5 ప్రకారాలతో ఉంటుంది. ఈ ఆలయంలో ఉత్తర కైలాసం, దక్షిణ కైలాసం అనే రెండు విభాగాలున్నాయి.ఉత్తర కైలాసాన్ని 10 వ శతాబ్ది మలి భాగంలో రాజేంద్ర చోళుని పట్టమహిషి లోకమహాదేవి నిర్మింపజేసింది.<ref>{{cite book|title=A handbook of Tamil Nadu|author=K. M. Venkataramaiah, International School of Dravidian Linguistics|publisher=International School of Dravidian Linguistics, 1996 - History - 544 pages|page=360}}</ref> ఆమె పేరు మీద లోకమహాదేవి ఈశ్వరం ఊదయారు అని కూడా అంటారు.<ref>{{cite book|title=Middle Chola Temples: Rajaraja I to Kulottunga I, A.D. 985-1070|author=S. R. Balasubrahmanyam|publisher=Thomson Press (India), 1975 - Hindu temples - 424 pages|page=89}}</ref> దక్షిణ కైలాసాన్ని రాజేంద్ర చోళుని భార్య పునర్నిర్మించింది.
 
ఈ ఆలయంలో కాల సంహారమూర్తి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం బయట [[ఆది శంకరాచార్యులు]] నెలకొల్పిన హోమగుండాన్ని చూడవచ్చు. ఈ హోమగుండంలో కుంగళియుం అనే సాంబ్రాణి వంటి పదార్థాన్ని వేస్తారు.
 
కావేరి తీరం వెంట ఉన్న ఆరు ముఖ్యమైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. మిగతావి తిరువిడైమురుదూరు, మాయిలదుతురై, సాయవనం (పూంపుహార్ వద్ద), తిరువెంగాడు, తిరువానిజం.
"https://te.wikipedia.org/wiki/తిరువయ్యారు" నుండి వెలికితీశారు