నువ్విలా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 29:
భ్రమలు తొలగిన విద్యార్థి ఆనంద్ (అజయ్), మోడల్ కావాలనుకునే మహేష్ ( [[ హవిష్ కోనేరు|హవిష్]] ), కాబోయే వయోలినిస్టు రాజు ( [[ ప్రసాద్ బార్వే|ప్రసాద్ బార్వే]] ) - వీళ్ళకు ఒక విషయం ఉమ్మడిగా ఉంది. ఈ ముగ్గురూ పిజ్జా ఎక్స్‌ప్రెస్‌లో తమ కలల్ని సాధించుకునే క్రమంలో స్టాప్-గ్యాప్ అమరికగా పనిచేస్తూన్నారు. ఒక పిజ్జా డెలివరీ వాటి మధ్య చేతులు మారినప్పుడు, మూడు ప్రేమ కథలు పుడతాయి. అర్చన ( [[యామీ గౌతం|యామి గౌతమ్]] ) కు ఆనంద్ పిజ్జా డెలివరీ చేసి అమెతో ప్రేమలో పడతాడు. మహేష్ తన ప్రేయసి మాధవి (సరయు) తో విడిపోవడానికి వెళ్లి "శైలు గే" ( [[హలీం ఖాన్|హలీమ్ ఖాన్]] ) కు ప్రేమ వస్తువుగా మారతాడు. రాజు వయోలిన్ ఆడిషన్ కోసం వెళ్లి తనను ద్వేషించే రాణి ( [[ రెమ్య నంబీసన్|రెమ్య నంబీసన్]] ) ని కలుస్తాడు. జీవితం అతని చెయ్యి దాటిపోతుంది.
 
అర్చన ప్రసిద్ధ క్రికెటర్ విష్ణు ( [[విజయ్ దేవరకొండ]] ) తో ప్రేమలో ఉందని తెలుసుకున్న ఆనంద్ ఇబ్బందుల్లో పడతాడు. విష్ణు చనిపోయినప్పుడు అర్చన అతడి బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు అతనికి ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడి అవుతాయి. ఆనంద్ తన సొంత ఇంటి నుండి గెంటివేయబడినా అర్చనకు ఆశ్రయం ఇస్తాడు. శైలు మహేష్‌ను వేధిస్తాడు. సందర్భోచిత ఆధారాల ఆధారంగా మహేష్ తల్లిదండ్రులు తమ కుమారుడు స్వలింగ సంపర్కుడని నమ్ముతారు. శైలు మహేష్‌ను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు, అతని తల్లిదండ్రులు వారి సమ్మతిని ఇచ్చినప్పుడు మహేష్ జీవితంలో నిరాశ శిఖర స్థాయికి చేరుతుంది. తన ప్రేమను త్యాగం చేసి, మహేష్ ను తన మాజీ ప్రేమికుడితో పెళ్ళి చెయ్యాలని కోరుకున్న శైలు మాజీ ప్రేమికుడు (చక్రవర్తి) కనిపించడంతో కథ మరింత ముదురుతుంది.. ఇంకా అపరిచితమైన పరిస్థితులు రాజును రాణిని నడిపిస్తాయి. అరెస్టు, తదుపరి జైలును నివారించడానికి వారు వెంటనే విడాకులు తీసుకోవడానికి మాత్రమే పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. కానీ వారు ఆ కొద్ది సమయంలోనే ప్రేమలో పడతారు. ఒకరికొకరు తమ నిజమైన భావనకు వ్యతిరేకంగా విడాకులు తీసుకుంటారు.
 
చివరికి ఆనంద్, అర్చనలను ఆనంద్ తల్లిదండ్రులు దంపతులుగా అంగీకరిస్తారు, మహేష్, మాధవి తిరిగి కలుసుకుంటారు. రాజు, రాణి బలీయమైన బృందాన్ని ఏర్పాటు చేసి వారి స్వంత టీవీ షోను మొదలు పెడతారు.
"https://te.wikipedia.org/wiki/నువ్విలా" నుండి వెలికితీశారు