బాణం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (3)
పంక్తి 28:
 
== కథ ==
1989 లో రణస్థలి పట్టణంలో జరిగే కథ ఇది. భగత్ పాణిగ్రాహి ( [[నారా రోహిత్]] ) [[ ఇండియన్ పోలీస్ సర్వీస్|ఐపిఎస్]] అధికారి కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతని తండ్రి చంద్రశేఖర్ పాణిగ్రాహి ( [[సాయాజీ షిండే|సయాజీ షిండే]] ) మాజీ [[నక్సలైటు]]. 20 సంవత్సరాల తరువాత జనజీవన స్రవ్ంతి లోకి తిరిగి వస్తాడు. అతని భావజాలం ప్రకారం ఒక నిర్దిష్ట కాలం తరువాత ప్రతి వ్యక్తి తమ పదవి నుండి విరమణ చేయాలి. [[నక్సలైటు|నక్సలిజంలో]] పదవీ విరమణ చేసిన మొదటి వ్యక్తి అతడు. అతను ఇంటికి తిరిగి వచ్చాక, ఐపిఎస్ కావాలన్న తన కొడుకు ఆశయాన్ని ప్రశ్నిస్తాడు ఎందుకంటే అతని భార్యను పోలీసులే చంపేసారు. భగత్ తన తర్కంతో తండ్రిని ఒప్పించి, అంగీకారం పొందుతాడు. ఇంతలో, స్థానిక డాన్, శక్తి పట్నాయక్ ( [[రణధీర్ గట్ల]] ) నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. పోలీసులను, అతనిని వ్యతిరేకించే వారిని భయపెడుతున్నాడు.
 
ఒక రోజు, భగత్ ఒక రైల్వే స్టేషన్లో సుబ్బలక్ష్మి ( [[వేదిక|వేధిక]] ) అనే అమాయక వివాహిత [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] యువతిని కలుస్తాడు. కట్నం చెల్లించనందున ఆమె అత్తమామలు ఆమెను అక్కడ వదిలేసి, వదిలించేసుకున్నారు. కట్నం ఇచ్చుకోలేని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమెకు ఇంకా తెలియదు. ఇప్పుడు భగత్ సహాయంతో ఆమె స్వతంత్ర మహిళగా మారడానికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఒక రోజు ఆమె భర్త రహస్యంగా కలుద్దామనిఆమెకు ఒక సందేశాన్ని పంపుతాడు, అప్పుడు భగత్ అతనిని కలవడానికి ఆమెతో వెళ్తాడు. ఆ సమావేశంలో ఆమె తన భర్తతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటుంది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో, ఆమె మాజీ భర్త ఆమెను అపహరించడానికి శక్తి ముఠాను మాట్లాడుకుంటాడు. ఇది భగత్, శక్తి మధ్య వరుసగా కొన్ని సంఘటనలకు దారితీస్తుంది. ఆ తరువాత భగత్ సుబ్బలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదిస్తాడు. చివరికి ఆమె అంగీకరిస్తుంది.
 
ఇంతలో భగత్ యుపిఎస్సిలో అర్హత సాధిస్తాడు శిక్షణ కోసం వెళ్తూండగా మధ్యలో శక్తి ముఠా అతనికి అడ్డుకుని కొట్టడంతో గాయపడతాడు,. అప్పుడు కోపంతో అతడి తండ్రి శక్తిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ప్రయత్నం తప్పిపోయి శక్తి అతన్ని పట్టుకుంటాడు. తరువాత అతన్ని దారుణంగా చంపేస్తాడు. వాస్తవాలు తెలుసుకున్న తరువాత భగత్ శక్తిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. శక్తి దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ట్రైనీలను నిలబెట్టమని కోరేందుకు భగత్ తన బాల్యంలోనే ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి ప్రేరేపించిన ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి (ఎస్.బాలచందర్) ను కలుస్తాడు. ముందు అతను అందుకు నిరాకరిస్తాడు కానీ తరువాత అంగీకరిస్తాడు. భగత్ ఆ ట్రైనీలతో కలిసి శక్తి ముఠా ఆట కట్టించడం తరువాత తాను పోస్టింగు పొందడం మిగతా కథ.  
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/బాణం_(సినిమా)" నుండి వెలికితీశారు