మాయామశ్చీంద్ర (1975 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (3)
పంక్తి 16:
|producer=పింజల సుబ్బారావు|story=గబ్బిట వెంకటరావు|dialogues=గబ్బిట వెంకటరావు|cinematography=కె.ఎస్ ప్రసాద్|editing=కందస్వామి}}
 
'''మాయామశ్చీంద్ర''' 1975 లో వచ్చిన [[ హిందూ పౌరాణిక చిత్రం|హిందూ పౌరాణిక చిత్రం]], పిఎస్ఆర్ పిక్చర్స్ బ్యానర్ <ref>{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/1414/maaya-maschindra-cast.html|title=Maya Maschindra (Banner)|work=Chitr.com}}</ref> లో, బాబు భాయ్ మిస్త్రీ దర్శకత్వంలో <ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/maya-machindra-1975-telugu-movie|title=Maya Maschindra (Director)|work=Filmiclub}}</ref> పింజల సుబ్బారావు నిర్మించాడు ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[వాణిశ్రీ]] ప్రధాన పాత్రలలో <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/maya-machindra-movie/16489|title=Maya Maschindra (Cast & Crew)|work=gomolo.com}}</ref> నటించారు. [[చెళ్ళపిళ్ళ సత్యం|సత్యం]] సంగీతం సమకూర్చారు. <ref>{{వెబ్ మూలము|url=https://spicyonion.com/title/2-alakh-niranjan-hindi-movie/|title=Maya Maschindra (Review)|work=Spicy Onion}}</ref>
 
== కథ ==
ఈ చిత్రం క్షీరసాగర మథనంతో మొదలవుతుంది. ఇక్కడ అమృతం పుట్టి జగన్ మోహిని (కాంచన) రూపంలో [[విష్ణువు|విష్ణుమూర్తి]] (ఎన్.టి.రామారావు) వచ్చి అమృతాన్ని దేవతలకు ఇచ్చి, రాక్షసులకు అందకుండా చేస్తాడు. నారదుడు (కాంతారావు) ద్వారా ఈ సంగతి తెలుసుకున్న [[శివుడు]] (రామకృష్ణ) తనను అలా ఎవరూ మోసం చేయలేరనీ తాను కామదహనం చేసినవాణ్ణనీ అంటాడు. అది విన్న విష్ణువు మళ్ళీ మోహినిగా వస్తాడు. శివుడు మోహినిని మోహిస్తాడు. అప్పుడు విష్ణువు తన అసలు రూపంలో కనబడి శివుణ్ణి గేలి చేస్తాడు. అప్పుడు శివుడు విష్ణువుకు కూడా ఒక పాఠం నేర్పుతానని సవాలు చేస్తాడు. లక్ష్మి దేవి (వాణిశ్రీ) కూడా, స్త్రీయే పురుషుని కన్నా గొప్పదని, అందుకే విష్ణువు స్త్రీ రూపాన్ని తీసుకున్నాడనీ వాదిస్తుంది. వారు దానిని నిరూపించాలని నిర్ణయించుకుంటారు.
 
ఇప్పుడు విష్ణువు మాయా మశ్చీంద్ర ఋషి అవతారం తీసుకొని మోక్షం పొందడానికి పారాయణాలు చేస్తాడు. నారదుడు రెచ్చగొట్టిన మీదట, హనుమంతుడు (అర్జా జనార్థన్ రావు) మశ్చీంద్రను పరీక్షించడానికి వెళ్ళి, అతన్ని తన ప్రభువుగా గుర్తించి అతని పాదాలకు నమస్కరిస్తాడు. శివుడు గోరఖ్ రూపాన్ని తీసుకొని మశ్చీంద్రకు శిష్యుడవుతాడు. లక్ష్మి తిలోత్తమా దేవిగా జన్మిస్తుంది. ఈమె పురుష ద్వేషి. పురుషులే లేని మహిళా రాజ్యాన్ని స్థాపిస్తుంది. అది విన్న మశ్చీంద్ర, ఆమె వద్దకు వెళ్ళినపుడు ఆమె అతణ్ణి హెచ్చరిస్తుంది. కానీ ఆమె ఉపాయాలు విజయవంతం కావు. ఆమె అతనికి శిష్యురాలు అవుతుంది, అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. ఈ జంటకు మీననాథ అనే బిడ్డ జన్మిస్తాడు.. హనుమంతుడి ద్వారా ఈ సంగతి తెలుసుకున్న గోరఖ్, తన గురువు మనస్సును తిరిగి ఆధ్యాత్మికత వైపు మళ్లించాలని నిర్ణయించుకుంటాడు. కానీ తిలోత్తమా దేవి అతడి ప్రయత్నాలను విఫలం చేస్తుంది. అతనిని తొలగించడానికి కూడా ప్రయత్నిస్తుంది. గోరఖ్ తన గురువును తనతో పాటు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తాడు. కానీ కుమారుడి బంధం మశ్చీంద్రను వెనక్కి లాగుతుంది. ఆ సమయంలో, గోరఖ్ మీనానాథపై ఒక పామును పంపిస్తాడు. అది కరచి అతను చనిపోతాడు. మశ్చీంద్ర బాలుడిని బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు. కాని శారీరక బంధం కారణంగా అతను తన శక్తిని కోల్పోతాడు, అప్పుడు మశ్చీంద్ర గోరఖ్ ను ప్రయత్నించమని అడుగుతాడు. కాని అతను కూడా విఫలమవుతాడు. నిరుత్సాహపడిన గోరఖ్, తనను తాను దగ్ధం చేసుకుంటాడు. హనుమంతుడు అతడి చితాభస్మాన్ని తెచ్చి, నిజమైన హృదయంతో తన ప్రయత్నం వృద్ధి చెందుతున్నప్పుడు గోరక్‌ను సజీవంగా మార్చమని మశ్చీంద్రను అభ్యర్థిస్తాడు, మశ్చీంద్ర అతన్ని బ్రతికిస్తాడు. ఆ సమయంలో, గోరక్ తాను మీనానాథను ఎందుకు బ్రతికించలేక పోయానని ప్రశ్నిస్తాడు. అహంకారం కారణంగా అని హనుమంతుడు అతనికి జ్ఞానోదయం చేస్తాడు. గోరఖ్ తన తప్పును గ్రహించి, తన గురువును ప్రార్థిస్తూ మీనానాథను బ్రతికిస్తాడు. చివరగా ''వీరంతా వైకుంఠానికి'' తిరిగి చేరుకుంటారు. సృష్టిలో మగ, ఆడ సమానమని, విష్ణువు వివరిస్తాడు.  
 
==నటీనటులు==