జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి ఇతివృత్తం
చి ఇతివృత్తం
పంక్తి 18:
ఐత్ మాతోవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.
 
రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యా-జర్మనీల మధ్య యుద్ధం (ది గ్రేట్ పేట్రియాటిక్ వార్) ముమ్మరంగా కొనసాగుతున్న కాలం అది. దేశ రక్షణకై నిర్బంధంగా సైన్యంలోకి తరలించబడిన రష్యన్ యువకులలో, కిర్గిజ్ ప్రాంతానికి చెందిన సాదిక్ ఒకడు. సైన్యంలో చేరాల్సిందిగా పిలుపు రావడంతో పెళ్ళైన నాలుగు నెలలకే సాదిక్ అనివార్యంగా యుద్ధరంగానికి పోవలిసివస్తుంది. అలా పోతూ తన భార్య జమీల్యాను తన గ్రామంలో వున్న ఉమ్మడికుటుంబంలో వదిలి వెళ్ళిపోతాడు. సనాతన సంప్రదాయాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబంలో వున్న సభ్యులందరు అహర్నిశం కష్టపడుతూ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తుంటారు. ఒకవైపు పంటను పండించడం, అలా పండిన ధాన్యాన్ని సైన్యానికి సరఫరా చేయడం కోసం సమీప పట్టణంలోని రైల్వే స్టేషన్ యార్డ్ కు తోలుకెళుతూ గడపడంలోనే వారికి కాలం గడచిపోతూ ఉంటుంది.
 
అటువంటి సాంప్రదాయిక ఉమ్మడికుటుంబంలో అడుగుపెట్టిన జమీల్యాకు దుడుకుతనం, మంకుపట్టు ఉన్నప్పటికీ నిజాయితీగా, నిష్కపటంగా వర్తించే స్వభావం కలది. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పాటు అందరితో సరదాగా కలుపుగోలుతనంతో వుండే జమీల్యాకు అత్తింట్లో చిట్టి మరిది సీట్ చేదోడు వాదోడుగా నిలుస్తాడు. కుటుంబ సంప్రదాయాలను అమితంగా గౌరవించే సాదిక్, తన భార్య జమీల్యా పట్ల ప్రేమను వ్యక్టం చేయడంకన్నా ఆమెను తన సొత్తులా భావించే మనస్తత్వం కలిగివుంటాడు. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని వైవాహిక జీవితం ఆమెది. అందుకే అత్తింట ఆదరాభిమానాలతో ఉల్లాసంగా గడిచిపోతున్నప్పటికీ ఆమెకు జీవితం ప్రేమ రాహిత్యంగానే గడిచిపోతుంది.
 
==ప్రధాన పాత్రలు==
 
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు