జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
అటువంటి సాంప్రదాయిక ఉమ్మడికుటుంబంలో అడుగుపెట్టిన జమీల్యాకు దుడుకుతనం, మంకుపట్టు ఉన్నప్పటికీ నిజాయితీగా, నిష్కపటంగా వర్తించే స్వభావం కలది. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పాటు అందరితో సరదాగా కలుపుగోలుతనంతో వుండే జమీల్యాకు అత్తింట్లో చిట్టి మరిది సీట్ చేదోడు వాదోడుగా నిలుస్తాడు. కుటుంబ సంప్రదాయాలను అమితంగా గౌరవించే సాదిక్, తన భార్య జమీల్యా పట్ల ప్రేమను వ్యక్టం చేయడంకన్నా ఆమెను తన సొత్తులా భావించే మనస్తత్వం కలిగివుంటాడు. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని వైవాహిక జీవితం ఆమెది. అందుకే అత్తింట ఆదరాభిమానాలతో ఉల్లాసంగా గడిచిపోతున్నప్పటికీ ఆమెకు జీవితం ప్రేమ రాహిత్యంగానే గడిచిపోతుంది.
 
ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే అంతర్ముఖుడైన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్ కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్ ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది. స్టెప్పీ మైదానాలలో వెన్నెల రాత్రుల్లో దనియార్ పాడిన పాటలు జమీలాలోజమీల్యాలో మనస్సును మైమరపిస్తాయి. అతని గానమాధుర్యంతో, ఆ ప్రేమ మహోజ్వలమై చివరకు ఆమె తన సమాజాన్ని, భర్తను విడిచి అతని వెంట పోవడానికి దారితీస్తుంది. అతని ఆత్మీయ సాహచర్యంతో, తనకు కావాలినదేమిటో ఆమెకు విస్పష్టమైన తరువాత ఆమె ఇక వెనక్కి చూడలేదు. భర్త సాదిక్ కూడా త్వరలోనే గ్రామానికి రానున్నాడని తెలిసినప్పటికీ ఆ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అప్పటి సామాజిక ఆచారాలను, కుటుంబ కట్టుబాట్లను, ధిక్కరించి మరీ జమీల్యా తన మనస్సుకి నచ్చిన ధనియార్ తో సహజీవనం కొనసాగించడానికి స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులు వేస్తుంది.
 
వదినగా ఆమెను మూగగా ఆరాధించే ఆమె చిట్టి మరిది సీట్, ఆమె వెన్నంటి తిరుగుతూ, వీరిరువురి పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే నవలకు తొలి పేరుగా 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని సూచించబడినప్పటికీ చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.
 
==ప్రధాన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు