యమజాతకుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: 5 మార్చి 1999 → 1999 మార్చి 5, శ్రీనివాస
పంక్తి 12:
 
== కథ ==
శివాజీ (మోహన్ బాబు) న్యాయవాది. డబ్బు కోసం న్యాయాన్ని తప్పుదోవ పట్టించడం అతడు చేసే పని. స్త్రీలోలుడు. అతని మేనకోడలు చింటు (బేబీ నిహారికా) అంటే గారాబం, ప్రేమ. ఒకసారి అతడు ఎంపి నరసింహమ్ (తనికెళ్ళ భరణి) కుమారుడు శ్రీనాథ్ (శ్రీహరి) కేసును తీసుకుంటాడు. అతను తన పనిమనిషిపై అత్యాచారం చేసి చంపాడని అతడిపై ఆరోపణ. శివాజీ ఆ కేసును తారుమారు చేసి డ్రైవర్ బాబ్జీ (నవీన్) కి శిక్ష వేయిస్తాడు ఆ తరువాత, శివాజీ నిజంగా ఒక అందమైన అమ్మాయి శిరీష (సాక్షి శివానంద్) ప్రేమలో పడతాడు. ఆమె పరిచయంలో, అతను తన గత జీవితాన్ని విడిచిపెడతాడు. శిరీష ఇంట్లో పనిచేసే బాబ్జీ తల్లి రాములమ్మ (అలపాటి లక్ష్మి) వారి నిశ్చితార్థం సందర్భంగా అతన్ని చూస్తుంది. వాళ్ళ బంధం నిలబడదని శపిస్తుంది.
 
ప్రస్తుతం, శివాజీ బాబ్జీని రక్షించాలని నిర్ణయించుకుంటాడు, కాబట్టి, అతను కేసును తిరిగి తెరుస్తాడు. ఎంపి నరసింహం, శ్రీనాథ్ లు శివాజీని చంపుతారు. అతను నరకానికి చేరుకుంటాడు. అదే సమయంలో, వారు కొత్త యమధర్మరాజు (రాజేంద్ర ప్రసాద్) పట్టాభిషేక వేడుకను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం, శివాజీ తన జీవితకాలం ఇంకో 11 రోజులు మిగిలే ఉందని తెలుసుకుని నరకంలో గందరగోళం, అల్లకల్లోలం సృష్టిస్తాడు. కాబట్టి, రహస్యంగా ఉంచటానికి యమ అతన్ని ఒక అందమైన అమ్మాయి పూతన (సాధిక) తో పాటు వెనక్కి భూమికి పంపిస్తాడు. ఆ తరువాత, దుష్టులు మళ్లీ తిరిగి ప్రవేశించినప్పుడు శివాజీ గెలవటానికి దాదాపు అంచున ఉన్నాడు. పోరాటంలో, చింటు కంటి చూపును కోల్పోతుంది. రాములమ్మ తన కళ్ళను ఆమెకు పెట్టమని కోరుతుంది. ఇంతలో, శివాజీ శిరీషల పెళ్ళి ఏర్పాట్లు తిరుమల వద్ద జరుగుతూంటాయి. తాను బతికుండే రోజులు తక్కువగా ఉన్నందున పెళ్ళి రద్దు చేయాలని శివాజీ నిర్ణయించుకున్నాడు. కాబట్టి, అతను తన మాజీ ప్రియురాలు స్వర్ణ (చాందిని) తో కలిసి శీరిష తన పట్ల ద్వేషాన్ని పెంచుకునేలా ఒక నాటకం ఆడతాడు. పూతన కూడా అతని ధర్మాన్ని అర్థం చేసుకుంటుంది. ఆమె కూడా అతనికి సహాయపడుతుంది. యముడు దానిని గమనిస్తాడు, అతను భూమిపైకి వస్తాడు. తన జీవిత భాగస్వామికి దీర్ఘాయువు ఉందని శిరీష జాతకం గురించి ఒక రహస్యాన్ని పొరపాటున వెల్లడిస్తాడు. ఇప్పుడు శివాజీ తిరుమల వైపు పరుగెత్తుతుండగా యముడు అతన్ని వెంబడిస్తాడు. తిరుమల చేరుకుని యమపాశం తనను చేరేలోగానే శిరీష మెళ్ళో తాళి కడతాడు. చివరగా, [[వేంకటేశ్వరుడు|వెంకటేశ్వర స్వామి]] (ఎన్.టి.రామారావు), యమధర్మరాజులు కొత్తగా పెళ్ళైన జంటను ఆశీర్వదిస్తూ ఉండగా సినిమా ముగుస్తుంది.
 
== తారాగణం ==
{{colbegin}}
*[[మోహన్ బాబు]]
*[[గద్దె రాజేంద్ర ప్రసాద్]]
*[[సాక్షి శివానంద్]]
*[[శ్రీహరి (నతుడు)|శ్రీహరి]]
పంక్తి 39:
* '''కళ''' : బి. వెంకటేశ్వరరావు
* '''కొరియోగ్రఫీ''' : రాజు సుందరం, సరోజ్ ఖాన్, డికెఎస్ బాబు
* '''స్టిల్స్''' : శ్రీనివాస రావుశ్రీనివాసరావు, గోపి శెట్టి
* '''పోరాటాలు''' : [[ విజయన్ (స్టంట్ కోఆర్డినేటర్)|విజయన్]]
* '''కథ - సంభాషణలు''' : [[పరుచూరి సోదరులు]]
పంక్తి 50:
* '''స్క్రీన్ ప్లే - దర్శకుడు''' : ఎన్. శంకర్
* '''బ్యానర్''' : [[శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్|శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్]]
* '''విడుదల తేదీ''' : 51999 మార్చి 19995
 
== పాటలు ==
 
* డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
* హే సంగ ఇవ్వాలని ఉంది
* నవ్వాలమ్మ నవ్వాలి
* నీ చెవులకు పెట్టిన
"https://te.wikipedia.org/wiki/యమజాతకుడు" నుండి వెలికితీశారు