రాముడు కాదు కృష్ణుడు (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజసులోచన నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావ
పంక్తి 12:
 
== కథ ==
రాము (అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు) అమాయకుడు. కుటుంబ ప్రతిష్టకుప్రతిష్ఠకు కట్టుబడి ఉండే కోటీశ్వరుడు బహదూర్ అప్పా రావు (సత్యనారాయణ) కుమారుడు. రాము చుట్టూ చాలా మంది బంధువులు ఉన్నారు. అతని మామ గోపాలరావు ఒక మోసగాడు. అతని భార్య రాధమ్మ (రాజసులోచన), తల్లి కాంతమ్మ (సూర్యకాంతం), కుమార్తె జయమ్మ (జయమాలిని), మేనల్లుడు గిరి (గిరి బాబు) వీరంతా అతనికి సేవ చేస్తామనే ముసుగులో అతడి ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారు. రాముడిని జాగ్రత్తగా చూసుకునేది అతని వదిన వరాలమ్మ (జయంతి), మరణించిన అన్నయ్య భార్య. ఆమెనతను తల్లిగా గౌరవిస్తాడు. రాము ఒక పేద అమ్మాయి శారద (రాధిక) ను ప్రేమిస్తాడు. కాని అతను తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఆమెను వదులుకొని జయమ్మను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. వాస్తవానికి, జయమ్మకు గిరితో సంబంధం ఉంది, ఇది కూడా వరాలమ్మ గమనించి రాముకు చెబుతుంది. అప్పుడు గోపాలరావు, రాము వరాలమ్మల మధ్య అక్రమ సంబంధాన్ని ఆపాదించి పసిపిల్లలతో పాటు ఆమె ఇంటిని విడిచి వెళ్ళేలా చేస్తాడు. ఆ తరువాత, రాము కూడా ఆస్తిని వదులుకుని వెళ్ళిపోతాడు. ఆ తరువాత, అప్పారావును దివాళా తీయించడం, పిచ్చివాడిగా చూపించి ఇంట్లోనే బంధించి ఉంచడం చేస్తారు.
 
మరోపక్క, కృష్ణ (అక్కినేని నాగేశ్వర రావే) చలాకీ కుర్రాడు, రాము తమ్ముడు, తన తల్లి లక్ష్మి (సుకుమారి) తో కలిసి నివసిస్తూంటాడు. ఒక అందమైన అమ్మాయి సత్య (జయసుధ) తో ప్రేమలో పడతాడు. ఒకసారి అతను అనుకోకుండా రామును కలుసుకుంటాడు. గోపాల రావు కుటుంబం యొక్క తప్పుడు ఆట కారణంగా ఆమె తండ్రి అప్పారావు గర్భవతిగా ఉన్నప్పుడు తనను మోసం చేశాడని లక్ష్మి గతం వివరిస్తుంది. ఇంతలో, కృష్ణ విచ్ఛిన్నమైన కుటుంబాన్ని కలిపి, శారదను కూడా తిరిగి తీసుకువస్తాడు. అప్పారావు కూడా జైలు నుండి తప్పించుకొని వారిని చేరుకుంటాడు. ప్రస్తుతం, కృష్ణుడు ఒక నాటకం ఆడి, దుష్టుల ఆట కట్టిస్తాడు. రాము - శారద, కృష్ణ -సత్య ల పెళ్ళిళ్ళతో ఈ చిత్రం ముగుస్తుంది.