"బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(జీవిత విశేషాలు)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: 2017 source edit
 
 
=== జీవిత విశేషములు ===
వీరి తండ్రి మోహన్ రావు, తల్లి హనుమాంబ. వీరిది నియోగి బ్రాహ్మణ కుటుంబం. వీరి పూర్వులు దొండపాడు, గుంటగర్లపాడు అను రెండు అగ్రహారములకేకాక 84 గ్రామములకు ఆధిపత్యము కలిగియుండిరి. వీరందరును దాతలు, శ్రోత్రియులు, నిత్యాన్నదాతలు, విద్యాదాతలు. ఈ వంశములో స్త్రీలు సంస్కృత పాండిత్యము కలిగియుండిరి.శ్రీ రామరాయకవికి ఐదవ సంవత్సరము వచ్చునాటికే తండ్రి దివంగతుడు అయినారు. వీరి పినతండ్రి కేశవరావుగారు శ్రీరామరావు కుపనయనము గావించి కొంత ప్రాధమిక విద్యనేర్పించి తరువాత ఆంగ్ల విద్యాభ్యాసము కొరకు గుంటూరులో ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టెను.సంస్కృత సాహిత్యమునకు అద్వైత సాహిత్యమునకు అపారమైన సేవ చేయవలసి యుండిన శ్రీ రామరావుకు ఆంగ్లవిద్య వలదని తలచెను కాబోలు ఆయనకు నిత్యము శరీరావస్థత కలుగుచుండెను.విసిగిపోయిన కేశవరావు శ్రీ రామరావును పమిడిపాడులో బెల్లంకొండ సీతారామయ్యగారి వద్ద సంస్కృత విద్యనభ్యసించుటకు ప్రవేశపెట్టెను.అందరికి ఆశ్చర్యపరుచునట్లు సంస్కృత విద్యాభ్యాసముతో శ్రీ రామరావుకు స్వస్థత చేకూరెను.బాల్యము నుండి శ్రీ రామరావు అసమాన ప్రజ్ఞాశాలి. తమ పురోహితులవద్ద కొంత వైదిక విద్యను నేర్చుకొని ఉత్తమ విద్యాప్రాప్తికొరకు తమ ఇంటివద్దనున్న ప్రాచీన హయగ్రీవ సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నిత్యము అర్చించుచుండెను.ఒకనాడు హయగ్రీవుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపమున స్వప్నములో శ్రీ రామరావుకు సాక్షాత్కరించి హయగ్రీవమంత్ర ముపదేసించి ఆ మంత్రమునకు అవసరమగు కవచము, మాల, పంజరము, యంత్రము మొదలగువాటిని సమీపమునున్న దమ్మాలపాడు గ్రామములో వైభానస రత్నమాచార్యులవద్ద లభించునని చెప్పి అంతర్ధానమాయెనట.శ్రీ రామరావు గారు దమ్మాలపాటికేగి రత్నమాచార్యుల నుండి హయగ్రీవ మంత్రాంగములగు కవచ, పంజరాదులను సంపాదించుకొని శాస్త్ర విధి అనుసరించి అక్సరలక్షలు జపించి మంత్రమునకు పునశ్చహ్రణము గావించుకొనిరి.తత్ఫలితముగా వారికసాధారణ మేధ, ధారణశక్తి, కవిత్వము లభించెను.తనయొందు పొగి పొరలు భక్తి భవమునకు కవిత్వము తోడుగా '''రమావల్లభరాయ స్తోత్రము''' '''రమావల్లభరాయ శతకము''' మొదలగు స్తోత్రములను తమ 16వ యేట రచించిరి. తమ పదునారువ సంవత్సరమునకే "రుక్మిణీపరిణయ చంపూ" "రమాపరిణయ చంపూ" కందర్పదర్ప విలాస భాణము" మొదలగు కావ్యములను రచించిరి. అటుపై తన 19వ సం.న నెల్లూరు వాస్తవ్యులు సింగరాజు వేంకటరమణయ్యగారి ద్వితీయ పుత్రిక ఆదిలక్ష్మమ్మతో వివాహము జరిగెను.వీరికి సంతానము కలుగలేదు.చాలామంది విద్యార్ధులకు అన్నము పెట్టి చదువు చెప్పించి విద్యాసేవ చేసిరి.
 
688

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3028445" నుండి వెలికితీశారు