లైలా మజ్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
}}
 
==ప్రముఖ రచయిత చలం వాఖ్యలు==
 
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు. రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా మీద తను రచించిన మ్యూజింగ్స్ లో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ కింది విధంగా వ్రాశాడు:
 
లైలా మజ్ఞు ప్రపంచ సారస్వతంలోని ప్రేమ కథల్లో ఒకటి. ఆ కథ, నాటకాలై తరువాత హిమందీ సినిమాలై, ప్రస్తుతం తెలుగులోకి దిగింది. ఆ ప్రేమగాధని ఏంగా తయారు చేశారో, ప్రతిరాత్రీ రెండుసార్లు వినడం తప్పలేదు నాకు. ఫిల్ము అంతా ఏడుపే. అంతకన్నా ఏడుపు ఇంక కల్పించడ ఎవర్కీ అసాధ్యం చేసేశారు. తెలుగు వాళకి ఏడుపులు ఇష్టం గావును. పల్లెటూళ్ళాలో చెప్పే పాత బుర్ర కథలన్నీ అన్యాయంగా నరుక్కోడాలూ, ఏడుపులూ, భయాలు..
 
ఒకరంటారూ, ఈ చిత్రంలో ఆడవాళ్ళకి కొన్ని బట్టలు తీసేసి చూపడం ముఖ్యమైన ఆకర్షణ అని. అట్లాంటి అశ్లీలమైన పని చేస్తే సెన్సార్లు ఎట్లా ఒప్పుకున్నారో! ప్రభ్త్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అశ్లీలాలు చిత్రాల్లోకి ఎక్కకండా. ఎందుకంటే తెలుగు సినిమా తారలు పూసుకునే రంగులూ, కట్టుకునే బట్టలూ, ఉండలూ, తీసేసి అసలు స్వరూపాల్ని ఒక్కసారి చూపారంటే, ఇంక ఎటువంటి ప్రేక్షకుడూ ఆ సినిమాల వేపు పోడు. మద్యపాన నిషేధంతో అస్లే అవస్థపడుతున్న ప్రభుత్వానికి, ఆదాయం మరీ తగ్గుతుంది. అప్పుడు సినిమాలకి వెళ్ళని వారిమీద పన్ను వెయ్యగల పద్దతి అలోచించాల్సి ఉంటుంది.
 
ఈ కథలో నాయకీ నాయకులు ప్రపంచ సారస్వతంలో గొప్ప ప్రియులు. గాధ అద్వితీయం. ఈ చిత్రాన్ని తయారు చేసిన గుంపులో, కవులు, చిత్రకారులు, గాయకులు, దర్శకులు, నటులు-ఎవరికన్నా, అప్పుడన్నా అలోచనలకి వచ్చిందా, మామూలుగా మనుష్యుల హృదయాల్లో కలిగే ప్రేమ స్వబావం-అది వ్యక్తమయ్యే విధం! ఫిల్ము అంతా ప్రేమో, ప్రేమో అని అరుపులు, వూరంతా వినపడేట్టు అరుపులు. వళ్ళని పిచ్చివాళ్ళు అనుకోకపోతే ఇంకేమనుకుంటారు?
 
దీంటో కొత్తరకమైన ప్రియుల్ని కనిపెట్టారు. "పనమయే ప్రేతముల్ని" పాట చివర "పెళ్ళికూతురా!" అంటాడు. కొంచెంసేపు ఆ పాటే ఉమ్టే మూడోది ఓ తిట్టు వస్తుందనుకుంటాము. ఆ నాయకి "మన ప్రేమలూ ఊ ఊ ఊ" అని ఊరంతా ఊదుతుంది.
 
ఈశ్వర కటాక్షంవల్ల వాళ్ళిద్దరూ, అంతటితో చచ్చిపొయినారు గాని లేకపొతే ఎట్లానూ వాళ్ళని వెళ్ళగొడుదురు, పురశాంతికోసం. అట్లా ఏడవకపోతే, ఎక్కడికన్నా పారిపోకూడదా అనుకుంటామా, వళ్ళెందుకు పొటారూ? మరె వాళ్ ప్రేమ అరుపుల్ని వెనేదెవరు, అక్కడి కన్నా పారిపొతే!
 
ఫిల్ము చివర నీతి సమస్య వచ్చింది. పెళ్ళి అయిన అమెను ప్రెయుడితో కలసి కాపరం ఎట్లానా చెయ్యనీడమని. అందుకని సరే తుఫాను తెప్పించారు. ఆ తుఫానులో ఎద్దరూ చచ్చిపోయినారు. నాయకుడు పటుత్వమైన ఉపన్యాసమిచ్చి, వెంటనే చస్తాడు. 'అమ్మా చచ్చరు. ఇంక నిద్రపోవచ్చు' ననుకుంటామా! వాళ్ళు చావరు. పైకి ఎగిరి ఆకాశంమీద నుంచి మళ్ళీ పాట లంకించుకుంటారు. ఒక్ వేళ వాళ్ళని సక్షణంగా కాపరానికి పెట్టినా ఇంత హంగామా రోజూ చేస్తూనే ఉండేవారేమో!
"https://te.wikipedia.org/wiki/లైలా_మజ్ను" నుండి వెలికితీశారు