జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
* ''మధ్య ఆసియా సమాజంలోని కట్టుబాట్లలో చిక్కుకున్న మహిళల జీవితాలను ఈ నవల స్పృశించింది.'' మధ్య ఆసియాలోని సంచార గిరిజన సమాజాల మధ్యన ఉన్న సామాజిక సంబంధాలను, ఆచార-సంప్రదాయాల పేరిట అక్కడ పాతుకుపోయిన సాంస్కృతిక బంధనాలను ఈ నవల సున్నితంగా మన కళ్ళ ముందు నిలుపుతుంది. ఉదాహరణకు, ఒక వితంతువుకు కుమారులు ఉన్నప్పుడు, వంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడం కిర్గిజ్ ఆచారం. ఆ విధంగా ఆమె తన పిల్లలతో పాటు, వివాహితుడి ఆస్తి అవుతుంది. ఆచారాలు, కట్టుబాట్లను గౌరవించే సాదిక్ (జమిల్యా భర్త) తన ఉత్తరంలో పేరు పేరునా అందరిని పలకరించి, చివరకు తన భార్యను మొక్కుబడిగా అడిగానని చెప్పమంటాడు. అతని దృష్టిలోనే కాదు అప్పటి వ్యవస్థలోనే భార్యకు అంతకు మించి ప్రాధాన్యత లేదు. జమీల్యాను వివాహం చేసుకున్న విధంగానే, ఆచారం పేరిట స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం కిర్గిజిస్థాన్ సమాజాలలో ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా భావించే సమాజపు కట్టుబాట్లలో చిక్కుకున్న మధ్యఆసియా మహిళల దయనీయ జీవితాలను ఈ నవల హృద్యంగా తాకగలిగింది.
 
*''సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలను నిలువుటద్దంనిలువుటద్దంగా పట్టిందినిలిచింది ఈ నవల.''ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
 
==రిఫెరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు