జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
*''సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ నవల.'' ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
 
*''సంధి దశలో సామాన్యుల మానసిక ఘర్షణని ప్రతిఫలించింది.'' జమీల్యా నవల, మారుతున్నటువంటిసంధి వ్యవస్థల మధ్యదశలో నలిగిపోతున్న వ్యక్తుల మానసిక సంఘర్షణను సుస్పష్టంగా ప్రతిబింబించింది. ఒకవైపు కుటుంబ పరువు ప్రతిష్టలు, కట్టుబాట్లు మరోవైపు సోషలిస్టు భావజాలం తీసుకు వస్తున్న విన్నూతన ఆలోచనల మధ్య నలిగిపోతున్న సామాన్య జీవితాలు పొందే మానసిక ఘర్షణ, జమీల్యా లోని ప్రతీ అక్షరంలోను కనిపిస్తుంది.
 
==రిఫెరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు