శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Undid edits by 2409:4070:2500:6F64:51A2:2448:29DB:96F6 (talk) to last version by Chaduvari: reverting vandalism
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం SWViewer [1.4]
పంక్తి 165:
ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశారు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించారు. అతను మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ ''కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద'' అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.
 
==శ్రీశ్రీ helloగురించి heప్రముఖుల is a good poet I like him for his persnolitiపలుకులు==
 
*
* "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
* "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - [[చలం]], యోగ్యతా పత్రంలో
* "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - [[పురిపండా అప్పలస్వామి]]
* "తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగు లేని మలుపు మహాప్రస్థానం" - డా. పాపినేని శివశంకర్.
*అతను సృజించిన '''కవితా! ఓ కవితా!''' అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, [[బూదరాజు రాధాకృష్ణ]] ఇలా రాసాడు: "''కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది''"<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర" />
*ఆ రోజుల్లో శ్రీశ్రీ [[రాజమండ్రి]] ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-[[గురజాడ అప్పారావు]] '[[కన్యాశుల్కం]]' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, అతను రాసిన కవితల్ని, పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. వీరికి 16 ఏళ్లు. ఒకరోజు అతను హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చారు వీరు. అప్పటిదాకా అతనుే శ్రీశ్రీ అని వీరికి తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ చెప్పు?' అన్నారు.
 
'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి [[గోదావరి]] స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు. (జగన్నాథరావు వనమాలి [[జె.ఆర్. వనమాలి]]గా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినిమా, ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా పొందాడు. )
=== యోగ్యతా పత్రం ===
 
యోగ్యతా పత్రం - మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో [[చలం]] రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు:
 
::''ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమేనయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.''
 
::''తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.''
 
శ్రీశ్రీ నిర్వహించిన '''ప్రజ ''' శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
 
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
* శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మద్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త. ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.)
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు