రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. అదేవిదంగా [[కాకతీయులు|కాకతీయ]], ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. [[బ్రిటిషు|బ్రిటీషు]] వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన [[నిజాం|నిజాం సుల్తాను]]లు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]], [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో [[అనంతపురం జిల్లా|అనంతపురం]]ను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
[[వేమన]] తిరుగాడిన నేల కావున రాయలసీమ అనడం కన్నా [[వేమనసీమ]] అని పిలువడం సబబుగా ఉంటుంది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]]లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న [[బళ్లారి|బళ్ళారి]] నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]]లో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్రప్రదేశ్]] లో భాగంగా ఉంటున్నవి.
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు