వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 52:
 
ఇక పోతే, నేను చురుగ్గా లేని రోజుల గురించి మీరు మాట్టాడారు. ఏం జరిగింది అనేది ముఖ్యం, అప్పుడు ఎవరున్నారు, ఎవర్లేరు అనేది అప్రస్తుతం. మీకు తెలీదేమో.. నేను చురుగ్గా లేని రోజుల్లో చాలానే జరిగాయి. నేను చురుగ్గా పనిచెయ్యడం మొదలయ్యాక వాటి గురించి నేను మాట్టాడాను కూడా. అప్పుడు జరిగిన గొప్ప సంగతుల గురించీ మాట్టాడాను, అప్పుడు జరిగిన తప్పుల గురించీ మాట్టాడాను. అవి జరిగిన రోజుల్లో నేను చురుగ్గా లేకపోయినా మీరు చురుగ్గానే ఉన్నారు. మీరు అప్పుడూ మాట్టాడలేదు, తరవాతా మాట్టాడలేదు. మనకు అనుకూలంగా లేకపోతే నోరు మెదపక పోవడం, అనుకూలంగా ఉంటే మాత్రం అనుభవం పేరుతో ఉచిత సలహాలు ఇవ్వడం.. ఇట్టాంటివి చెయ్యకూడదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:23, 8 సెప్టెంబరు 2020 (UTC)
==ఓటింగ్ అనేది నియమంలోనే ఉంది==
ఇక్కడ ఏమి జరుగుతోందన్నది సెలవులో ఉన్నందున నాకు పూర్తిగా తెలియదు కాని ఈ చర్చాపేజీని గమనిస్తే ఇదివరకే చర్చ జరిగిందనీ దాన్నే ఫలితంగా ప్రకటించాలనీ ప్రధాన అభ్యంతరం ఉన్నట్లుగా గమనించాను. సుమారు ఏడేళ్ళ క్రితం ఓటింగ్ మార్గదర్శకాలపై చర్చ జరిగి ఒక పద్దతి రూపుదిద్దుకుందనీ తత్ప్రకారంగా ముందుగా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా చెబుతోంది. అమలులో ఉన్న నియమం ప్రకారమే అర్జునగారు చర్చ తర్వాతే ఓటింగ్ పెట్టారనీ తెలుస్తోంది. కాబట్టి ఆ చిత్తుచర్చను ఫలితంగా ప్రకటించే అవసరం ఉండదు. ఓటింగే ప్రధానం కాబట్టి నియమం ప్రకారం రెండు వారాలపాటు కొనసాగిన ఓటింగే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటింగును వ్యతిరేకించే అవసరం నాకైతేలేదు మరియు ఓటు వేయడానికి నాకు అభ్యంతరమూ లేదు. భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలనే ప్రతిపాదన నాకు సమ్మతమే. నేను అనువాద వ్యాసాలేమీ చేయకున్ననూ యాంత్రిక అనువాదాల గురించి పూర్తిగా తెలుసు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:55, 9 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".