అంజూరం: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
దిద్దుబాటు సారాంశం లేదు
{{మూలాలు సమీక్షించండి}}
 
'''అంజూరం'''ను ''మంచి మేడి'', ''సీమ అత్తి'', ''తినే అత్తి'' అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 [[అడుగు]]ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క [[బెరడు]] నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల [[ఆకారం]]లో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 [[అంగుళం|అంగుళాల]] పొడవు ఉంటుంది. ఈ [[పండ్లు]] పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే [[ఇరాన్]], మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరాన్ని 5 వేల సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది.
 
1,91,609

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3030877" నుండి వెలికితీశారు