అంతరిక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మూలాలు సమీక్షించండి}}
 
[[File:3D coordinate system.svg|thumb|right|A right-handed three-dimensional [[Cartesian coordinate system]] used to indicate positions in space.]]
'''అంతరిక్షం''' అనంతమైన త్రిపరిమాణాత్మక ప్రదేశము. [[భూవాతావరణం|భూవాతావరణ]] [[కక్ష్య]]కు అవతల ఉన్న, [[హద్దు]]లు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం (స్పేస్) అంటారు. ఫలానా చోట భూవాతావరణం అంతమై, అంతరిక్షం మొదలౌతుందని విభజన [[రేఖ]] గీయటం కష్టం. అంతరిక్షం దగ్గరవుతున్నకొద్దీ, [[వాతావరణం]] కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని ముప్పావుభాగం [[భూమి]]చుట్టూ 11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు, భూమి ఉపరితలానికి 120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సందర్భాలలో, [[కార్మాన్ రేఖ]]ను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది [[భూమి]] ఉపరితలానికి 100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది. [[ఆకాశం]]లో మనకు కనిపించే కోటానుకోట్ల [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[తోకచుక్కలు]] మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే [[విశ్వము]] అంటాం. అంతరిక్షంలోని ప్రతీ [[అణువు]] కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షంలోని ప్రతీ అణువు ఏ చోటకు వెళ్ళినా, దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి. భౌతిక అంతరిక్షాన్ని తరచుగా మూడు సరళ పరిమితులుగా పేర్కొంటారు. అయితే ఇదే సమయంలో ఆధునిక భౌతిక [[శాస్త్రవేత్తలు]] ఈ అనంతమైన భాగాలను నాలుగు అవిభక్త (క్వాంటినం) పరిమాణాల (డైమెన్షనల్) అంతరిక్షకాలం (స్పెస్ టైం) అంటున్నారు. [[గణితశాస్త్రం]]లో, "స్పేస్" పరిమాణాలను, వివిధ సంఖ్యలు, వివిధ అంతర్లీన నిర్మాణాలతో పరీక్షించారు. భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు, సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన అంతరిక్ష భావనను పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/అంతరిక్షం" నుండి వెలికితీశారు