అమరావతి (గ్రామం): కూర్పుల మధ్య తేడాలు

కొత్త చిత్రాన్ని జతచేశాను. రెండవ పటాన్ని తొలగించాను.
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== చరిత్ర ==
[[శాసనాలు|ప్రాచీన శాసనాల]] ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని [[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది.<ref>సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి సంపుటి, 1958 ప్రచురణ, పేజీ సంఖ్య 261</ref> ఈ పట్టణము [[జైన]], [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతాలకు కూడా ప్రసిద్ధమైనది. [[శాతవాహనులు|శాతవాహనులలో]] ప్రసిద్ధుడైన [[శాలివాహనుడు|గౌతమీపుత్ర శాతకర్ణి]] మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో [[ధరణికోట|ధాన్యకటకము]] ప్రసిద్ధిచెందినది. [[చైనా]] యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ [[పట్టణము]]లో నివసించి అచటి [[వైభవము]] గురించి ప్రశంసించాడు.
అమరావతీ నగరాన బౌద్ధులు [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయము]] స్థాపించారని [[రాయప్రోలు సుబ్బారావు]] అన్నారు. ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్థూపాలను మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా [[ధరణికోట]] అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన [[శాతవాహనులు|శాతవాహను]]లకు సుమారు సామాన్యశక పూర్వం 3 వ శతాబ్దం నుండి సామాన్యశక పూర్వం 2 వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి [[రాజధాని|రాజధానిగా]] వుండేది. [[గౌతమ బుద్ధుడు]] తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి [[బుద్ధుడు|బుద్ధు]]నికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రయాన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి.
 
===సంస్థాన కేంద్రంగా===
పంక్తి 22:
[[File:Amaravati stupa. at Amaravati.Side view.JPG|thumb|right|అమరావతి స్తూపం]]
 
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న [[ధరణికోట]] ఒకప్పటి ఆంధ్ర [[శాతవాహనులు|శాతవాహనుల]] రాజధానియైన '''[[ధాన్యకటకం]]'''. శాతవాహనుల కాలంలో [[బౌద్ధ మతము|బౌద్ధ మతం]] పరిఢవిల్లింది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి [[మెగస్తనీసు]] పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న ఆధారాలున్నాయి. [[బుద్ధుడు|బుద్ధుని]] జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.<ref>{{Cite wikisource |title=ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము|chapter=తొమ్మిదవ ప్రకరణము#అమరావతీ స్తూపము బయల్పడుట |author= చిలుకూరి వీరభద్రరావు|date=1910}}</ref> అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన [[విగ్రహాలు]], పరికరాలు, ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లోను, అలక్జాండర్ రియ 1888-89 మధ్యలోనూ చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ [[మ్యూజియం]], [[చెన్నై]], బ్రిటిష్ మ్యూజియం, [[లండన్]] లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య, కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. తవ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని [[శిల్పం|శిల్పాలు]] నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల ఆధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్దికి చెందిందని తెలిసింది.
 
అద్భుతమైన [[శిల్పకళ]]తో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై [[బ్రాహ్మీ లిపి]]లో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి [[బ్రిటిషు]] పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది [[భారత దేశము|భారతదేశం]]లోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_(గ్రామం)" నుండి వెలికితీశారు