తెలుగుతల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
[[File:Telugu Talli Statue.jpg|thumb|తెలుగు తల్లి]]
సాహిత్యపరంగా [[తెలుగుతల్లి]] అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం. తెలుగుతల్లి చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటుంది. [[తెలుగు]] నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన [[పంట]] ఉంటుంది. కుడి చేతిలో ఉన్న [[కలశం]] తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ఈ తెలుగుతల్లిని ఆరాధించటం ద్వారా మానవాళికి అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తుందని తెలుగు ప్రజలు భావిస్తారు, అందువలన తెలుగు ప్రజల జీవితాలలో తెలుగు తల్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారతదేశంలోని [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం|ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం]] యొక్క అధికారిక గీతం '''మా తెలుగు తల్లి'''. ఈ గీత రచయిత [[శంకరంబాడి సుందరాచారి]], 1942లో చిత్తూరు వుప్పలదడియం నాగయ్య నటించిన '''ధీన బంధు''' అనే తెలుగు చిత్రం కోసం ఈ గీతాన్ని వ్రాసారు. ఈ గీతం అత్యంత ప్రజాదరణ పొందటంతో చివరికి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక గీతంగా చేశారు.
"https://te.wikipedia.org/wiki/తెలుగుతల్లి" నుండి వెలికితీశారు