శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగు: 2017 source edit
పంక్తి 273:
 
శాతవాహన నాణేలు వాటి కాలక్రమం, భాష, ముఖ లక్షణాలకు (గిరజాల జుట్టు, పొడవాటి చెవులు, బలమైన పెదవులు) ప్రత్యేకమైన సూచనలు ఇస్తాయి. వారు ప్రధానంగా సీసం, రాగి నాణేలను జారీ చేశారు; వారి పోర్ట్రెయిటు తరహా వెండి నాణేలు సాధారణంగా పశ్చిమ క్షత్ర రాజుల నాణేల మీద ముద్రించబడ్డాయి. శాతవాహన నాణేలు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, చైత్యాలు (స్థూపాలు) వంటి వివిధ సాంప్రదాయ చిహ్నాలను కూడా ప్రదర్శిస్తాయి. అలాగే "ఉజ్జయిని చిహ్నం", చివర నాలుగు వృత్తాలు కలిగిన శిలువ.
 
శాతవాహనుల నాణెములు శతసహస్రములు లభించినవి. అందు లేఖనములు కల నాణెములు అనేకము కలవు. లేఖనములు అనగా నాణెములను వేయించిన రాజుల పేరుకల వాక్యములు. అవి షష్ఠీవిభక్త్యంతములుగ ఉండును. లేఖనములు కలనాణెములు ఆ పేరిట రాజుయొక్క నాణెమని అర్ధము.
వీటిలో శిముక శాతవాహనుని నాణెములు లేఖనములయందు: సాతవాహనస, సతవాహణస, సిరిచిముకసాతవాహన అను పేరుకల నాణెములు కలవు. అందు నావాసా వద్ద లభించిన 1810, 4685, 6544, 6863 సంఖ్యగల నాణెములు, మరొకొన్ని హైదరాబాదు, ఔరంగాబాదు,ఓరుగల్లు, కరీంనగర్, కోటిలింగాల వద్ద లభించినాయి.
కృష్ణశాతకరి నాణెములు: ఈనాణెముల లేఖనములయందు రాజ్ఞః శ్రీకృష్ణశాతకర్ణి: పేరు కలదు. ఇవి మహరాష్ట్ర లో కల నవాసా, చంద మండలములయందు లభించినవి.
శ్రీశాతకర్ణి నాణెములు: సిరిసాతకణిస, సిరిపాతకణస అను లేఖనములు గల అనేకనాణెములు కలవు.అవి రాజ్ఞః శ్రీశాతకర్ణ: రాజుయొక్క నాణెములు.ఇవి పశ్చిమ భారత దేశమున లభించిన 5,6,7,171,172,173,174,175,176,177 సంఖ్యల నాణెములు. ఇవి కొండపూర్, నాసిక్, ఉజ్జయిని,త్రిపురి, కధియవాడ్, బాలాపూర్, అమరావతి, చేబ్రోలు, మాచెర్ల, నాగార్జునకొండ మొదలయిన స్థలములలో లభించినవి.
నాగనికా శ్రీశాతకర్ణుల వెండినాణెములు: జున్నార దగ్గర లభించిన వెండినాణెముల మీద ముందువైపు రాజ్ఞః సిరిసాత నాగనికాయ అను లేఖనము కలదు. ఇది అశ్వమేధయాగ సందర్భములోని నాణెము.ఇవి హైదరాబాదు, ఖమ్మం, నాగార్జునకొండ, బీదర్ మొదలగు ప్రాంతములలో లభించినవి.
స్కందశాతకర్ణి నాణెములు: రాజ్ఞ:సిరిఖదసాతకణిస అను లేఖనము కల నాణెములు అలతికలవు.స్కందశాతకర్ణి పులమావి తర్వాతివాడు శివస్కందశాతకర్ని.ఇవి కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి.
హాలిని నాణెములు: రాజ్ఞ:సిరిసతస, సిరిసదస, సిరిసాతస అను లేఖనములు ఈరాజు పేరుమీద అలతికలవు.1,2 సంఖ్య గల నాణెములు కలవు.ఇవి కౌండన్యపురమునందు, మాళవదేశమునందు, ఉజ్జయిని, త్రిపురి, హైదరాబాదు, కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి.
మాఠరీపుత్ర శివస్వాతిశకసేనుని నాణెములు: మాఠరీపుతస, సకసదస, సకసెనన, శకసేనస్య పేరుగల లేఖనములు నాణెములు లభించినవి. 313, 311, 309, 310, 312 సంఖ్య గల నాణెములు లభించినవి. ఇవి తర్హాళానిధి, అమరావతి, బ్రహ్మపురి, కృష్ణా గోదావరి తీరములయందు లభించినవి.
 
===ఇతర ఉదాహరణలు===
<gallery mode="packed">
Line 279 ⟶ 289:
File:Coin of Gautamiputra Sri Yajna Satakarni.jpg|Coin of Gautamiputra [[Yajna Satakarni]] ({{reign|167|196 CE}}).
</gallery>
 
== సాంస్కృతిక సాధనలు ==
[[File:Karla caves Chaitya.jpg|thumb|right|200px|The Great Chaitya in the [[Karla Caves]], [[Maharashtra, India]], c. 120 CE. The Satavahana rulers made grants for its construction.]]
"https://te.wikipedia.org/wiki/శాతవాహనులు" నుండి వెలికితీశారు