బంగారు చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
* నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
==కథ==
డాక్టర్ రమేష్ తన చిట్టిచెల్లెలు లక్ష్మి పువ్వుల్లోపెట్టి పెంచుకుంటుంటాడు. తాగుబోతు మోహన్ తన ముద్దుల చెల్లాయిని మానభంగం చేయడం చూసిన రమేష్ అతడ్ని పిస్టల్‌తో చంపివేస్తాడు. మతి చలించిన లక్ష్మిని తన స్నేహితుడు డాక్టర్ ఆనంద్‌కి అప్పగించి రమేష్ అడవులపాలవుతాడు. జానకి గొప్పింటి అమ్మాయి. డాక్టర్ రమేష్‌ను ప్రేమిస్తూ ఉంటుంది. అడవుల్లో తిరుగుతున్న రమేష్‌ను జానకి కలుస్తుంది. ఉరికంబానికి ఎక్కబోయే తనను మరచిపొమ్మని రమేష్ జానకిని ఒప్పించాలని ప్రయత్నించి విఫలమౌతాడు. తన మెడలో రమేష్ మూడుముళ్ళు వేస్తుంటే జానకి మురిసిపోతుంది. సరిగ్గా ఆ సమయానికి పోలీసులు రమేష్‌ను బంధించారు. తన చెల్లాయి లక్ష్మిని మోహన్ చెరిచిన విషయం తనతోనే సమసిపోవాలన్న ఉద్దేశంతో డబ్బుకోసం మోహన్‌ను చంపానని కోర్టులో రమేష్ ఒప్పుకునే సరికి జానకి నిలువునా నీరైపోతుంది. ఖూనీ ఎందుకు జరిగిందో లక్ష్మి కోర్టులో చెబితేనే తన మాంగల్యం నిలబడుతుందని జానకి డా.ఆనందు ముందు కన్నీరు కారుస్తుంది. పూర్వస్మృతి కోల్పోయిన లక్ష్మి మామూలు స్థితికి వచ్చి కోర్టులో నిజం చెబుతుందా? కోర్టు లక్ష్మి సాక్ష్యాన్ని నమ్ముతుందా? అనే విషయాలు పతాక సన్నివేశంలో తెలుస్తాయి<ref name="పాటల పుస్తకం">{{cite book |last1=ఈశ్వర్ |title=బంగారు చెల్లెలు పాటలపుస్తకం |pages=8 |url=https://indiancine.ma/documents/CMX/ |accessdate=11 September 2020}}</ref>.
 
==పాటలు==
ఈ సినిమాలోని పాటలకు కె.వి.మహదేవన్ స్వరకల్పన చేశాడు<ref name="పాటల పుస్తకం" />.
"https://te.wikipedia.org/wiki/బంగారు_చెల్లెలు" నుండి వెలికితీశారు