నాని (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''నాని'''గా అందరికీ సుపరిచితమైన [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు '''నవీన్ బాబు ఘంటా'''. పుట్టిన ఊరు [[చల్లపల్లి]] (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో స్ధిరపడ్డారు. [[శ్రీను వైట్ల]], [[బాపు]] వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత [[హైదరాబాద్]]లో కొన్ని రోజులు [[రేడియో]] జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన [[ఈగ (సినిమా)|ఈగ]] కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో ''న్యాచురల్ స్టార్''గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన [[ఎవడే సుబ్రహ్మణ్యం (సినిమా)|ఎవడే సుబ్రహ్మణ్యం]] 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాతగా [[డీ ఫర్ దోపిడీ]] అనే చిత్రాన్ని నిర్మించారు. [[అ!|ఆ!]] అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్ లో వచ్చిన [[కృష్ణార్జున యుద్ధం (2018 సినిమా)|కృష్ణార్జున యుద్ధం]]లో నటించాడు. కానీ అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు. మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని.2018 లో కింగ్ [[నాగార్జున అక్కినేని]] గారితో [[దేవదాస్]] సినిమాలో కలిసి నటించారు. 2019లో [[జెర్సీ]] సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/నాని_(నటుడు)" నుండి వెలికితీశారు