రామ్ రాబర్ట్ రహీమ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
జగదీష్ భార్య ఒక చీటీ తన పిల్లల చేతిలో ఉంచి, ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరుతుంది. కాని విధివశాన ఆమెకు చూపు పోతుంది. జగదీష తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయలు దేరుతాడు. వాళ్ళను ఒక పార్కులో కూర్చోబెట్టి తాను ముందుకు సాగుతాడు. కారు ఒక దుర్ఘటనలో చిక్కుకుంటుంది. పెద్ద కొడుకు ఒక జీపుక్రింద పడగా పోలీస్ ఆఫీసర్ అతనిని తీసుకుపోతాడు. రెండవవాడు ఒక చర్చిలో ఫాదర్ దగ్గర దత్తపుత్రుడిగా పెరుగుతాడు. చిన్నవాడు ఒక ముస్లిం కుటుంబంలో పెరుగుతాడు. ఇలా జగదీష్ కుటుంబం విచ్చిన్నమౌతుంది. సంవత్సరాలు గడుస్తాయి.
 
జగదీష్ ఒక లక్షాధికారి అవుతాడు. పెద్దవాడు రామ్‌ బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రెండవవాడు రాబర్ట్, మూడవవాడు రహీమ్‌గా పెరుగుతారు. కన్నింగ్స్ కూతురు రోజీని జగదీష్ అపహరించి, పెంచి పై చదువులకు లండన్ పంపుతాడు. ఆమె తిరిగివస్తుంది. ఆమెను రాబర్ట్ ప్రేమిస్తాడు. రహీం మంచి కవ్వాలీ పాటగాడు అవుతాడు. అతడు రజియా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రామ్‌ బాధ్యతగల పోలీస్ ఆఫీసర్‌గా పిక్ పాకెట్ చేసే ఒక అమ్మాయిని నరకపు జీవితాన్నుంచి తప్పించి మంచి మార్గంలో పెడ్తాడు. ముగ్గురూ కలుసుకుంటారు కాని వారి వివరాలు వారికే తెలియవు.
 
కన్నింగ్స్ మరలా ధనవంతుడౌతాడు. చిన్నతనంలో జగదీష్ ఎత్తుకుపోయిన తన కూతురు రోజీని కలుసుకోవడానికి కన్నింగ్స్ తహతహలాడుతుంటాడు. అన్ని చోట్ల వెదుకుతుంటాడు. రోజీ అతనికి దొరికిన సమయంలో పరిస్థితుల ప్రోద్భలంవల్ల రోజీని తన పార్ట్‌నర్ అయిన జేమ్స్‌తో పరిణయం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది.
 
ఫాదర్ హత్యచేయబడిన సందర్భంలో రాబర్ట్ తన తండ్రియైన జగదీష్‌ను గుర్తుపడతాడు. పువ్వులమ్ముకుని జీవనం సాగిస్తున్న జగదీష్ పత్ని తన కొడుకు రహీంను గుర్తు పడుతుంది. రోజీ పెళ్ళి జరగబోయే సమయంలో రామ్‌, రాబర్ట్, రహీమ్‌ మారువేషాలలో కన్నింగ్స్‌ని, అతని ముఠాని పోలీసులకు అప్పగిస్తారు. జగదీష్ తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తన భార్య పిల్లలను తిరిగి కలుసుకుంటాడు<ref name="పాటల పుస్తకం">{{cite book |last1=ఈశ్వర్ |title=రామ్‌ రాబర్ట్ రహీమ్‌ పాటలపుస్తకం |pages=16 |url=https://indiancine.ma/documents/DJG |accessdate=12 September 2020}}</ref>.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/రామ్_రాబర్ట్_రహీమ్" నుండి వెలికితీశారు