జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

726 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
కథా నిర్మాణం-శైలి-చిత్రణ
చి (కథా నిర్మాణం-శైలి-చిత్రణ)
==నవల ఇతివృత్తం==
[[File:KG Ag Dzhamila a.jpg|thumb|జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం]]
ఐత్‌మాతోవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.
 
రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యా-జర్మనీల మధ్య యుద్ధం (ది గ్రేట్ పేట్రియాటిక్ వార్) ముమ్మరంగా కొనసాగుతున్న కాలం అది. దేశ రక్షణకై నిర్బంధంగా సైన్యంలోకి తరలించబడిన రష్యన్ యువకులలో, కిర్గిజ్ ప్రాంతానికి చెందిన సాదిక్ ఒకడు. సైన్యంలో చేరాల్సిందిగా పిలుపు రావడంతో పెళ్ళైన నాలుగు నెలలకే సాదిక్ అనివార్యంగా యుద్ధరంగానికి పోవలిసివస్తుంది. అలా పోతూ తన భార్య జమీల్యాను కుర్కురోవ్ గ్రామంలో వున్న తన ఉమ్మడికుటుంబంలో వదిలి వెళ్ళిపోతాడు. సనాతన సంప్రదాయాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబంలో వున్న సభ్యులందరు అహర్నిశం కష్టపడుతూ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తుంటారు. ఒకవైపు పంటను పండించడం, అలా పండిన ధాన్యాన్ని సైన్యానికి సరఫరా చేయడం కోసం సమీప పట్టణంలోని రైల్వే స్టేషన్ యార్డ్ కు తోలుకెళుతూ గడపడంలోనే వారికి కాలం గడచిపోతూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే మితభాషి అయిన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్ కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్ ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది. స్టెప్పీ మైదానాలలో వెన్నెల రాత్రుల్లో దనియార్ పాడిన పాటలు జమీల్యా మనస్సును మైమరపిస్తాయి. అతని గానమాధుర్యంతో, ఆ ప్రేమ మహోజ్వలమై చివరకు ఆమె తన సమాజాన్ని, భర్తను విడిచి అతని వెంట పోవడానికి దారితీస్తుంది. అతని ఆత్మీయ సాహచర్యంతో, తనకు కావాలినదేమిటో ఆమెకు విస్పష్టమైన తరువాత ఆమె ఇక వెనక్కి చూడలేదు. భర్త సాదిక్ త్వరలోనే గ్రామానికి రానున్నాడని తెలిసినప్పటికీ ఆ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అప్పటి సామాజిక ఆచారాలను, కుటుంబ కట్టుబాట్లను, ధిక్కరించి మరీ జమీల్యా తన మనస్సుకి నచ్చిన ధనియార్ తో సహజీవనం కొనసాగించడానికి స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులు వేస్తుంది.
 
ఆమె చిట్టి మరిది సీట్, వదినగా ఆమెను మూగగా ఆరాధిస్తూ, ఆమె వెన్నంటి తిరుగుతూ ఉంటాడు. వీరిరువురి పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే నవలకు తొలి పేరుగా 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని సూచించబడినప్పటికీ చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.
 
==ప్రధాన పాత్రలు==
ఒస్మాన్: ఉమ్మడి కుటుంబానికి దూరపు బంధువు. పోకిరీ. జమీల్యాను అల్లరి చేష్టలతో విసిగిస్తుంటాడు.<br>
ఒరోజ్మాత్: సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి దళ నాయకుడు.<br>
 
==కథా నిర్మాణం-శైలి-చిత్రణ==
జమీల్యా ప్రేమ కథను కౌమారప్రాయంలో అడుగుపెడుతున్న ఒక కథకుని కోణంలో చెప్పడం కనిపిస్తుంది. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.
 
కథ-కూర్పు నిర్మాణంలో మాత్రమే కాకుండా, కథ యొక్క ప్రధాన సైద్ధాంతిక మరియు కళాత్మక స్వభావాన్ని నిర్ణయించడంలో కూడా శ్రావ్యత ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే రచయిత మొదట్లో తన రచనను 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని పిలవడం జరిగింది. చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.
 
==అనువాదాలు==
7,951

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3031984" నుండి వెలికితీశారు