జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి కథా నిర్మాణం-శైలి-చిత్రణ
పంక్తి 39:
జమీల్యా ప్రేమ కథను కౌమారప్రాయంలో అడుగుపెడుతున్న ఒక కథకుని కోణంలో చెప్పడం కనిపిస్తుంది. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.
 
కథ-కూర్పు నిర్మాణంలో మాత్రమే కాకుండా, కథ యొక్క ప్రధాన సైద్ధాంతిక మరియు కళాత్మక స్వభావాన్ని నిర్ణయించడంలో కూడా శ్రావ్యత ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే రచయిత మొదట్లో తన రచనను 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని పిలవడం జరిగింది. చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.
 
కథ యొక్క లిరికల్-రొమాంటిక్ స్వభావం కారణంగా, ఈ కథను తరచుగా "గద్యంలో కవిత్వం" అని పిలుస్తారు. వాస్తవానికి ఈ రచన యొక్క ప్రధాన ఇతివృత్తం ప్రేమ. అయితే ఇందులో వ్యక్తీకరించబడిన ప్రేమ, ఇద్దరు ప్రేమికుల (జమీల్యా-ధనియార్) మధ్య ఏర్పడినది మాత్రమే కాదు. అది భూమి, సంగీతం, కళ మరియు అన్నిటికీ మించి ప్రకృతికి కూడా స్ఫూర్తినిచ్చే విశ్వ జనీనమైన ప్రేమ. అలాగే జీవితం పట్ల అంతులేని ప్రేమ, ప్రజల పట్ల మమకారం, జన్మ భూమి పట్ల అఖండ ప్రేమ మొదలైన అంశాలను ఈ ప్రేమ కథకు సాన్నిహితైక్య అంశాలుగా పరిగణిస్తారు.
 
==అనువాదాలు==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు