జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

1,834 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
పురస్కారాలు-గుర్తింపులు
చి (పురస్కారాలు-గుర్తింపులు)
 
==నవల ఇతివృత్తం==
[[File:KG Ag Dzhamila a.jpg|thumb|జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం]]
ఐత్‌మాతోవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు.
 
ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే మితభాషి అయిన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్ కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్ ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది. నీలి పర్వత సానువులలో, విశాల స్టెప్పీ మైదానాలలో మెరిసే నక్షత్రపు రాత్రుళ్లలో పోప్లార్ చెట్ల సాక్షిగా ప్రకృతిలో మమేకం అవుతూ గుర్రపు బగ్గీలు తోలుకుంటూ కాలం గడుపుతారు. స్టెప్పీ మైదానాలలో వెన్నెల రాత్రుల్లో దనియార్ పాడిన శ్రావ్యమైన పాటలు జమీల్యా మనస్సును మైమరపిస్తాయి. అతని మధుర కంఠస్వరంలో ప్రతిఫలించిన ప్రేమకు, ఎనలేని మమకారానికి, ఆర్తికి జమీల్యా హృదయం పరవశించిపోతుంది.
 
అతని సంపూర్ణ వ్యక్తిత్వంతో, గానమాధుర్యంతో, ఆ ప్రేమ మహోజ్వలమై చివరకు ఆమె తన సమాజాన్ని, భర్తను విడిచి అతని వెంట పోవడానికి దారితీస్తుంది. అతని ఆత్మీయ సాహచర్యంతో, తనకు కావాలినదేమిటో ఆమెకు విస్పష్టమైన తరువాత ఆమె ఇక వెనక్కి చూడడానికి ఇష్టపడదు. భర్త సాదిక్ త్వరలోనే గ్రామానికి రానున్నాడని తెలిసినప్పటికీ ఆ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అప్పటి సామాజిక ఆచారాలను, కుటుంబ కట్టుబాట్లను, ధిక్కరించి మరీ జమీల్యా తన మనస్సుకి నచ్చిన ధనియార్‌తో సహజీవనం కొనసాగించడానికి స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులు వేస్తుంది. చివరకు ఒక వర్షంరాత్రిలోవర్షంరాత్రి వేళ జమీల్యా తన భర్తను, ఇంటినీ, గ్రామాన్ని విడిచిపెట్టి తన జీవగర్ర అయిన ధనియార్ వెంట తనకు నచ్చిన కొత్త జీవితంలోకి సాగిపోతుంది.
 
ఆమె చిట్టి మరిది సీట్, వదినగా ఆమెను మూగగా ఆరాధిస్తూ, ఆమె వెన్నంటి తిరుగుతూ ఉంటాడు. జమీల్యా-ధనియార్‌ల పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ.
ఉద్వేగభరితమైన జమీల్యా ప్రేమకథతో ప్రేరణ పొందిన ఫ్రెంచ్ దర్శకుడు మేరీ-జౌల్ డి పోంచెవిల్లే 2008 లో కిర్గిజిస్థాన్ లో "టెంగ్రి: బ్లూ ప్యారడైజ్" చిత్రంను రూపొందించాడు. కిర్గిజిస్థాన్ స్టెప్పీ గడ్డి మైదానాల్లో పూర్తిగా చిత్రించబడిన మొదటి ఫ్రెంచి చలన చిత్రం ఇది.<ref>{{cite web |title=Tengri: Blue Heavens (2008) |url=https://www.imdb.com/title/tt1043565/?ref_=ttfc_fc_tt |website=www.imdb.com |accessdate=5 September 2020}}</ref>
 
==పురస్కారాలు-గుర్తింపులు==
[[File:KG Ag Dzhamila a.jpg|thumb|జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం]]
జమీల్యా, "ఫస్ట్ టీచర్" మరియు "ఫేర్వెల్ గుల్సరీ" లతో కూడిన సంకలనం "టేల్స్ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్పీస్" నకు 1963 లో చింగిజ్ ఐత్‌మాతోవ్‌కు సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రైజ్ లభించింది.
జమీల్యా రచనకు స్వర్ణోత్సవం నిండిన సందర్భంలో స్మారక చిహ్నంగా కిర్గిజిస్థాన్ ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళలో జమీల్యా, ధనియార్ లతో పాటు వారు ప్రతిరోజూ స్టేషన్‌కు తీసుకువెళ్ళే బండి ఉన్నాయి. అదేవిధంగా జమీల్యా-ధనియార్ లు కలసి వున్న దృశ్యంతో ఒక స్మారక నాణెంను విడుదల చేసింది.
 
"జమీలా" నవల సాహిత్య లోకంలో అప్పటివరకూ ఎవరికీ అంతగా పరిచితంగాని ఒక మధ్య ఆసియా రచయితను సోవియట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యలోకానికి తొలిసారిగా పరిచయం చేసింది.
==నవల ప్రత్యేకతలు==
* ''ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది.'' ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకూ ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను, సంక్షోభ పరిస్థితులలో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
7,658

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3031989" నుండి వెలికితీశారు