జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి అక్షర మార్పులు
చి చిన్న మార్పులు
పంక్తి 45:
 
==అనువాదాలు==
కిర్గిజ్‌లో "ఒబాన్" పేరుతో ప్రచురితమైన ఈ నవల 1958 లో రష్యన్‌ భాషలో న్యూ వరల్డ్ మాగజైన్‌లో "జమీల్యా" పేరుతో ప్రచురించబడింది. ఈ పేరుతోనే ప్రపంచ భాషలలో ప్రసిద్ది చెందింది. తొలుత సోవియట్ యూనియన్ లో విశిష్టమైన గుర్తింపు పొందిన దీనిని కవి లూయీ అర^గొవ్ ఫ్రెంచ్ భాషలో అనువదించడంతో, దీని గొప్పతనం ప్రపంచానికి వెల్లడైంది. నేటివరకు జమీల్యా నవల నూట యాభైకి పైగా ప్రపంచ భాషలలో ప్రచురించబడింది. భారతదేశంలోను దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలో ఇది అనువదించబడింది. తెలుగులో ఉప్పల లక్ష్మణరావు చేసిన అనువాదాన్ని 1971 లో ప్రగతి ప్రచురణాలయం ప్రచురించింది. తరువాత 2008 లో హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించింది.
==చలన చిత్రీకరణలు==
1968 లో ఇరినా పోప్లావాస్కయా, సెర్గీ యుట్కెవిచ్ దర్శకత్వంలో ఈ నవల రష్యన్ భాషలో జమీల్యా (రష్యన్ Джамиля) సినిమాగా విడుదలైంది. కథానాయకి జమీల్యా పాత్రలో నటల్యా అరిన్‌బసరోవా, ధనియార్ పాత్రలో సుయ్మెన్కుల్ చోక్మరోవ్ నటించారు.<ref>{{cite web |title=Jamilya (1969) |url=https://www.imdb.com/title/tt0064269/?ref_=nm_flmg_wr_18 |website=IMOB |accessdate=2 September 2020}}</ref> ఈ క్లాసిక్ చిత్రానికి రచయిత 'చింగిజ్ ఐత్‌మాతోవ్' స్వయంగా కథ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 
1994 లో మోనికా టిబెర్ దర్శకత్వంలో ఈ నవలను ఇంగ్లీష్ లో జమీలా (Jamila )పేరుతొ సినిమాగా తీశారు. <ref>{{cite web |title=Jamila (1994) |url=https://www.imdb.com/title/tt0110180/?ref_=nm_flmg_wr_7 |website=www.imdb.com |publisher=IMDB |accessdate=4 September 2020}}</ref>
 
ఉద్వేగభరితమైన జమీల్యా ప్రేమకథతో ప్రేరణ పొందిన ఫ్రెంచ్ దర్శకుడు మేరీ-జౌల్ డి పోంచెవిల్లే 2008 లో కిర్గిజిస్థాన్ లోకిర్గిజిస్థాన్‌లో "టెంగ్రి: బ్లూ ప్యారడైజ్" చిత్రంను రూపొందించాడు. కిర్గిజిస్థాన్ స్టెప్పీ గడ్డి మైదానాల్లో పూర్తిగా చిత్రించబడిన మొదటి ఫ్రెంచి చలన చిత్రం ఇది.<ref>{{cite web |title=Tengri: Blue Heavens (2008) |url=https://www.imdb.com/title/tt1043565/?ref_=ttfc_fc_tt |website=www.imdb.com |accessdate=5 September 2020}}</ref>
 
==పురస్కారాలు-గుర్తింపులు==
[[File:KG Ag Dzhamila a.jpg|thumb|జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం]]
"జమీలా" నవల సాహిత్య లోకంలో అప్పటివరకూ ఎవరికీ అంతగా పరిచితంగాని ఒక మధ్య ఆసియా రచయితను సోవియట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యలోకానికి తొలిసారిగా పరిచయం చేసింది. "జమీల్యా", "ఫస్ట్ టీచర్" మరియు, "ఫేర్వెల్ఫేర్‌వెల్ గుల్సరీ" లతో కూడిన సంకలనం "టేల్స్ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్పీస్" నకు 1963 లో చింగిజ్ ఐత్‌మాతోవ్‌కు సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రైజ్ లభించింది. జమీల్యా రచనకు స్వర్ణోత్సవం నిండిన సందర్భంలో స్మారక చిహ్నంగా కిర్గిజిస్థాన్ ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళలో జమీల్యా, ధనియార్ లతో పాటు వారు ప్రతిరోజూ స్టేషన్‌కు తీసుకువెళ్ళే బండి ఉన్నాయి. అదేవిధంగా జమీల్యా-ధనియార్ లు కలసి వున్న దృశ్యంతో ఒక స్మారక నాణెంను 2009 లో విడుదల చేసింది.
జమీల్యా రచనకు స్వర్ణోత్సవం నిండిన సందర్భంలో స్మారక చిహ్నంగా కిర్గిజిస్థాన్ ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళలో జమీల్యా, ధనియార్ లతో పాటు వారు ప్రతిరోజూ స్టేషన్‌కు తీసుకువెళ్ళే బండి ఉన్నాయి. అదేవిధంగా జమీల్యా-ధనియార్ లు కలసి వున్న దృశ్యంతో ఒక స్మారక నాణెంను విడుదల చేసింది.
 
"జమీలా" నవల సాహిత్య లోకంలో అప్పటివరకూ ఎవరికీ అంతగా పరిచితంగాని ఒక మధ్య ఆసియా రచయితను సోవియట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యలోకానికి తొలిసారిగా పరిచయం చేసింది.
==నవల ప్రత్యేకతలు==
* ''ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది.'' ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండనిలేని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకూస్త్రీలకు ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను, సంక్షోభ పరిస్థితులలోపరిస్థితులతో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో, యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
 
* ''మధ్య ఆసియా సమాజంలోని కట్టుబాట్లలో చిక్కుకున్న మహిళల జీవితాలను ఈ నవల స్పృశించింది.'' మధ్య ఆసియాలోని సంచార గిరిజన సమాజాల మధ్యన ఉన్న సామాజిక సంబంధాలను, ఆచార-సంప్రదాయాల పేరిట అక్కడ పాతుకుపోయిన సాంస్కృతిక బంధనాలను ఈ నవల సున్నితంగా మన కళ్ళ ముందు నిలుపుతుంది. ఉదాహరణకు, ఒక వితంతువుకు కుమారులు ఉన్నప్పుడు, వంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడం కిర్గిజ్ ఆచారం. ఆ విధంగా ఆమె తన పిల్లలతో పాటు, వివాహితుడి ఆస్తి అవుతుంది. ఆచారాలు, కట్టుబాట్లను గౌరవించే సాదిక్ (జమిల్యా భర్త) తన ఉత్తరంలో పేరు పేరునా అందరిని పలకరించి, చివరకు తన భార్యను మొక్కుబడిగా అడిగానని చెప్పమంటాడు. అతని దృష్టిలోనే కాదు అప్పటి పితృస్వామిక వ్యవస్థలోనే భార్యకు అంతకు మించి ప్రాధాన్యత లేదు. జమీల్యాను వివాహం చేసుకున్న విధంగానే, ఆచారం పేరిట స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం కిర్గిజిస్థాన్ సమాజాలలో ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా భావించే సమాజపు కట్టుబాట్లలో చిక్కుకున్న మధ్యఆసియా మహిళల దయనీయ జీవితాలను ఈ నవల హృద్యంగా తాకగలిగింది.
 
*''సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ నవల.'' ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
Line 70 ⟶ 68:
 
==సాహిత్యంలో నవల స్థానం–అంచనా==
తాను పుట్టి పెరిగిన సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సామాజిక, సాంస్కృతిక బంధనాల పట్ల సానుభూతితో, నిబద్దతతో స్పందిస్తూ,స్పందించిన రచయితగా చింగిజ్ ఐత్‌మాతోవ్ ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతూ స్త్రీ స్వేచ్ఛా పరిణతికి ప్రతీకగా జమీల్యాను సృష్టించాడు. ఇది ఒక మనోహరమైన ప్రేమకథగా ప్రశంసించబడినప్పటికీ, అంతకు మించి సోవియట్ ప్రగతిశీలక సాహిత్య చరిత్రలో వచ్చిన గొప్ప రచనలలో ఒకటిగా పరిగణించబడింది. ప్రపంచ సాహిత్యరంగంలో స్త్రీ స్వేచ్ఛను ప్రతిబింబించిన ఉదాత్తమైన రచనగా నిలిచింది. పితృస్వామిక సమాజంలో నలిగిపోతున్న స్త్రీల స్వేచ్ఛాయుత ప్రేమ జీవనాన్ని కాంక్షిస్తూ, నిజమైన జీవితానంద విలువలను పునర్నిర్వచిస్తూ వచ్చిన ప్రామాణిక నవల ఇది.
 
ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం (1940-45) కాలం నాటి సోవియట్ పాలనలో కిర్గిజ్ సంచార జాతుల సాంఘిక జీవన పరిస్థితులకు అద్దం పట్టిన ఈ కథను, సామాజిక కట్టుబాట్లను అధిగమించిన సాహసోపేతమైన ప్రేమకథగా మాత్రమే కాకుండా, అంతకు మించి సంక్షుభిత జన జీవితాలను సృజనాత్మకంగా ప్రతిఫలించే నవలగా, ఆధునికతకు, సంప్రదాయాలకు మధ్య తలెత్తే వైరుధ్యాలను స్పృశించిన నవలగా దీనిని పరిగణించారు.
 
నవల యొక్క సైద్ధాంతిక మరియు కళాత్మక స్వభావం కారణంగా, ఇది కిర్గిజ్ ప్రసంగ కళ (art of speech)ను కొత్త స్థాయికి తీసుకెళ్లడమే కాక, సృజనాత్మక వ్యక్తీకరణతో మధ్య ఆసియా ప్రజల ప్రసంగ కళకి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది.
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు