జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
మూస తొలగింపు
చి (నవల ప్రత్యేకతలు)
చి (మూస తొలగింపు)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
{{in use}}
[[File:Stamps of Kyrgyzstan, 2009-577.jpg|250px|right]]
'''జమీల్యా''' చింగిజ్ ఐత్‌మాతోవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన [[నవలా సాహిత్యము|నవల]] . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది.సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. అప్పటి సమిష్టి వ్యవసాయ సంస్కృతి (collective farming culture) నేపథ్యంలో సమకాలీన గిరిజన సంస్కృతి జీవితాలను ప్రతిబింబించే ఒక మనోహరమైన ప్రేమ కథ ఇది. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు.<ref>Erich Follath and Christian Neef, "[http://www.spiegel.de/international/world/0,1518,druck-720631,00.html Kyrgyzstan Has Become an Ungovernable Country]", ''Der Spiegel|SPIEGEL ONLINE International'', 8 October 2010.</ref> 1958 లో కిర్గిజ్ భాషలోనూ, [[రష్యా|రష్యన్ భాష]]లోను, వెలువడిన ఈ చిన్న నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, అనేకపలు భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్‌మాతోవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.
 
==రచయిత విశేషాలు==
 
==నవలా నేపధ్యం==
ఈ నవలలోని కథ సుమారుగా 1940-45 మధ్య కాలంలో [[రెండవ ప్రపంచ యుద్ధం]] కొనసాగుతున్న కాలంలో కిర్గిజిస్థాన్‌లో జరిగింది. కథలోని ఆధారాలను బట్టి ఇది వాయువ్య కిర్గిజిస్థాన్ ప్రాంతంలో కుర్కురోవ్ గ్రామంలొ జరిగివుండవచ్చు. అప్పటి సమిష్టి వ్యవసాయ సంస్కృతి (collective farming culture) నేపథ్యంలో సమకాలీన గిరిజన సంస్కృతి జీవితాలను ప్రతిబింబించే ఒక మనోహరమైన ప్రేమ కథ ఇది.
 
కిర్గిజిస్థాన్ మధ్యఆసియాలోని ఒక దేశం. ఇక్కడి ప్రజలు కిర్గిజ్ జాతికి చెందిన గిరిజన [[ముస్లింలు]]. ఈ సంచార జాతుల సమాజంలో, మొదటి నుంచి సనాతన సంప్రదాయాలతో పాటు, పితృస్వామ్య భావజాలాలు ప్రబలంగా ఉండేవి. అయితే 1924 లో కిర్గిజిస్థాన్ ప్రాంతం [[సోవియట్ యూనియన్]] లో ఒక రిపబ్లిక్‌గా మారిపోయినపుడు ఆ సమాజంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఏర్పడిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం, కిర్గిజ్ ప్రాంతంలో స్త్రీ విద్యను ప్రోత్సహించడమే కాక, ఆ రిపబ్లిక్‌లో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధిని చేపట్టింది. పారిశ్రామికీకరణను వేగంగా అమలుచేసింది. ఫలితంగా కిర్గిజ్ ప్రజలు ముఖ్యంగా అప్పటివరకు సనాతన కుటుంబ సంస్కృతులతో పెనవేసుకున్న గిరిజన ప్రజలు, కొత్తగా ప్రవేశపెట్టబడిన సాంఘిక వ్యవస్థలకు అలవాటుపడటమే కాకుండా, ఆధునిక మార్పులకు అనివార్యంగా లోనవడం జరిగింది. కిర్గిజ్ ప్రజలు, దానితో అప్పటివరకు అనుసరించిన సంప్రదాయ విశ్వాసాలకు, సోషలిజం యొక్క కొత్త భావజాలానికి మధ్య వారు మానసిక సంఘర్షణతో నలిగిపొయారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన స్త్రీ విద్య, సనాతన సంప్రదాయాలలో మగ్గిపోయిన కిర్గిజ్ మహిళలకు సంప్రదాయ సంకెళ్లను ఛేదించుకొని బయటపడటానికి, వారికి నచ్చిన జీవితంలో కొత్త దారులలో పయనించడానికి సహకరించింది. ఇటువంటి నేపథ్యంలో నాటి సనాతన కుటుంబంలో నుండి వచ్చిన నిజాయితీ, ధైర్యంగల జమీల్యా అనే స్త్రీ తనకు దక్కిన వైవాహిక జీవితాన్ని కాదని, నచ్చిన కొత్త జీవితాన్ని అందుకోవడానికి ముందడుగు వేయడం ప్రధానంగా చిత్రించబడింది.
 
==నవల ఇతివృత్తం==
7,473

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3032020" నుండి వెలికితీశారు