జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి మూస తొలగింపు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
ఆమె చిట్టి మరిది సీట్, వదినగా ఆమెను మూగగా ఆరాధిస్తూ, ఎల్లప్పుడూ ఆమె వెన్నంటి తిరుగుతూ ఉంటాడు. జమీల్యా-ధనియార్‌ల పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ.
 
==నవల ప్రత్యేకతలు==
* ''ఈ నవల కిర్గిజ్ మధ్య సామాజిక సంబంధాలను చక్కగా వివరిస్తుంది.'' ముఖ్యంగా మధ్య ఆసియాలోని సంచార జాతులు స్థిరపడుతున్న ఒకానొక సంధి కాలంలో, కిర్గిజిస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో నెలకొన్న కుటుంబ సంబంధాలు, అల్లుకున్న జీవితాల గురించి సూక్ష్మమైన అంతర్దృష్టిని అందించడమే కాకుండా, కుటుంబం, వైవాహిక బందం, జీవితం, వాస్తవికత, నిజమైన ప్రేమ, జీవితం యొక్క ఆనందం తదితర అంశాల గురించిన అనేక ప్రశ్నలకు సమాధానాలను సృజనాత్మకంగా అన్వేషించే ప్రయత్నం చేసింది.
 
* ''ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది.'' ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు లేని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకు ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను సంక్షోభ పరిస్థితులతో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో, యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
 
* ''మధ్య ఆసియా సమాజంలోని కట్టుబాట్లలో చిక్కుకున్న మహిళల జీవితాలను ఈ నవల స్పృశించింది.'' మధ్య ఆసియాలోని సంచార గిరిజన సమాజాల మధ్యన ఉన్న సామాజిక సంబంధాలను, ఆచార-సంప్రదాయాల పేరిట అక్కడ పాతుకుపోయిన సాంస్కృతిక బంధనాలను ఈ నవల సున్నితంగా మన కళ్ళ ముందు నిలుపుతుంది. ఉదాహరణకు, ఒక వితంతువుకు కుమారులు ఉన్నప్పుడు, వంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడం కిర్గిజ్ ఆచారం. ఆ విధంగా ఆమె తన పిల్లలతో పాటు, వివాహితుడి ఆస్తి అవుతుంది. ఆచారాలు, కట్టుబాట్లను గౌరవించే సాదిక్ (జమిల్యా భర్త) తన ఉత్తరంలో పేరు పేరునా అందరిని పలకరించి, చివరకు తన భార్యను మొక్కుబడిగా అడిగానని చెప్పమంటాడు. అతని దృష్టిలోనే కాదు అప్పటి పితృస్వామిక వ్యవస్థలోనే భార్యకు అంతకు మించి ప్రాధాన్యత లేదు. జమీల్యాను వివాహం చేసుకున్న విధంగానే, ఆచారం పేరిట స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం కిర్గిజిస్థాన్ సమాజాలలో ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా భావించే సమాజపు కట్టుబాట్లలో చిక్కుకున్న మధ్యఆసియా మహిళల దయనీయ జీవితాలను ఈ నవల హృద్యంగా తాకగలిగింది.
 
*''సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ నవల.'' ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
 
*''సంధి దశలో సామాన్యుల మానసిక ఘర్షణని ప్రతిఫలించింది.'' జమీల్యా నవల, సంధి దశలో నలిగిపోతున్న వ్యక్తుల మానసిక సంఘర్షణను సుస్పష్టంగా ప్రతిబింబించింది. ఒకవైపు కుటుంబ పరువు ప్రతిష్టలు, కట్టుబాట్లు మరోవైపు సోషలిస్టు భావజాలం తీసుకు వస్తున్న విన్నూతన ఆలోచనల మధ్య నలిగిపోతున్న సామాన్య జీవితాలు పొందే మానసిక ఘర్షణ, జమీల్యా లోని ప్రతీ అక్షరంలోను కనిపిస్తుంది.
 
==ప్రధాన పాత్రలు==
జమీల్యా : కథా నాయకి పాత్రకథానాయకి. స్వేచ్ఛాయుత జీవి. సాంప్రదాయిక బంధనాలు నుండి స్వేచ్ఛను కోరుకొంటూ తనకు నచ్చిన కొత్త జీవితంలోకి ధనియార్ వెంట నడిచిన పాత్ర.<br>
ధనియార్: కథానాయకుడు. కుంటికాలితో సైన్యం నుండి తిరిగి వచ్చి గ్రామంలో స్థిరపడిన అనాథ. ఆత్మికంగా సంపన్నుడు. మధుర గాయకుడు. చివరకి జమీల్యా ప్రేమను చూరగొంటాడు.<br>
సీట్: జమీల్యా మరిది. సాదిక్ తమ్ముడు. అన్నలు యుద్దభూమికి వెళ్ళినపుడు, వదిన జమీల్యాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె పట్ల అంతులేని అభిమానంతో వుండే పాత్ర. కథ యావత్తూ ఇతని కోణం నుంచి చెప్పబడుతుంది.<br>
Line 56 ⟶ 67:
[[File:KG Ag Dzhamila a.jpg|thumb|జమీల్యా రచనకు అంకితంగా కిర్గిజిస్థాన్ విడుదల చేసిన స్మారక నాణెం]]
"జమీలా" నవల సాహిత్య లోకంలో అప్పటివరకూ ఎవరికీ అంతగా పరిచితంగాని ఒక మధ్య ఆసియా రచయితను సోవియట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యలోకానికి తొలిసారిగా పరిచయం చేసింది. "జమీల్యా", "ఫస్ట్ టీచర్", "ఫేర్‌వెల్ గుల్సరీ" లతో కూడిన సంకలనం "టేల్స్ ఆఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్పీస్" నకు 1963 లో చింగిజ్ ఐత్‌మాతోవ్‌కు సోవియట్ యూనియన్‌లో లెనిన్ ప్రైజ్ లభించింది. జమీల్యా రచనకు స్వర్ణోత్సవం నిండిన సందర్భంలో స్మారక చిహ్నంగా కిర్గిజిస్థాన్ ప్రభుత్వం 2009 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళలో జమీల్యా, ధనియార్ లతో పాటు వారు ప్రతిరోజూ స్టేషన్‌కు తీసుకువెళ్ళే బండి ఉన్నాయి. అదేవిధంగా జమీల్యా-ధనియార్ లు కలసి వున్న దృశ్యంతో ఒక స్మారక నాణెంను 2009 లో విడుదల చేసింది.
 
==నవల ప్రత్యేకతలు==
* ''ఈ నవల కిర్గిజ్ మధ్య సామాజిక సంబంధాలను చక్కగా వివరిస్తుంది.'' ముఖ్యంగా మధ్య ఆసియాలోని సంచార జాతులు స్థిరపడుతున్న ఒకానొక సంధి కాలంలో, కిర్గిజిస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో నెలకొన్న కుటుంబ సంబంధాలు, అల్లుకున్న జీవితాల గురించి సూక్ష్మమైన అంతర్దృష్టిని అందించడమే కాకుండా, కుటుంబం, వైవాహిక బందం, జీవితం, వాస్తవికత, నిజమైన ప్రేమ, జీవితం యొక్క ఆనందం తదితర అంశాల గురించిన అనేక ప్రశ్నలకు సమాధానాలను సృజనాత్మకంగా అన్వేషించే ప్రయత్నం చేసింది.
 
* ''ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది.'' ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు లేని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకు ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను సంక్షోభ పరిస్థితులతో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో, యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
 
* ''మధ్య ఆసియా సమాజంలోని కట్టుబాట్లలో చిక్కుకున్న మహిళల జీవితాలను ఈ నవల స్పృశించింది.'' మధ్య ఆసియాలోని సంచార గిరిజన సమాజాల మధ్యన ఉన్న సామాజిక సంబంధాలను, ఆచార-సంప్రదాయాల పేరిట అక్కడ పాతుకుపోయిన సాంస్కృతిక బంధనాలను ఈ నవల సున్నితంగా మన కళ్ళ ముందు నిలుపుతుంది. ఉదాహరణకు, ఒక వితంతువుకు కుమారులు ఉన్నప్పుడు, వంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె తన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడం కిర్గిజ్ ఆచారం. ఆ విధంగా ఆమె తన పిల్లలతో పాటు, వివాహితుడి ఆస్తి అవుతుంది. ఆచారాలు, కట్టుబాట్లను గౌరవించే సాదిక్ (జమిల్యా భర్త) తన ఉత్తరంలో పేరు పేరునా అందరిని పలకరించి, చివరకు తన భార్యను మొక్కుబడిగా అడిగానని చెప్పమంటాడు. అతని దృష్టిలోనే కాదు అప్పటి పితృస్వామిక వ్యవస్థలోనే భార్యకు అంతకు మించి ప్రాధాన్యత లేదు. జమీల్యాను వివాహం చేసుకున్న విధంగానే, ఆచారం పేరిట స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం కిర్గిజిస్థాన్ సమాజాలలో ఇప్పటికీ కనిపిస్తుంది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా భావించే సమాజపు కట్టుబాట్లలో చిక్కుకున్న మధ్యఆసియా మహిళల దయనీయ జీవితాలను ఈ నవల హృద్యంగా తాకగలిగింది.
 
*''సంధి దశలో ఒక దేశం ఎదుర్కొన్న సంఘర్షణలకు నిలువుటద్దంగా నిలిచింది ఈ నవల.'' ఆధునిక సోషలిస్ట్ వ్యవస్థలు మధ్య ఆసియా రిపబ్లిక్లలోని సంచార గ్రామీణ వ్యవస్థలను భర్తీ చేస్తున్న చారిత్రాత్మక కాలంలో జమీల్యా నవల రాయబడింది. అందువలనే సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్థలు పాదుకొంటున్న సంధి దశలో కిర్గిజిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణకు ఈ రచన అద్ధం పట్టింది.
 
*''సంధి దశలో సామాన్యుల మానసిక ఘర్షణని ప్రతిఫలించింది.'' జమీల్యా నవల, సంధి దశలో నలిగిపోతున్న వ్యక్తుల మానసిక సంఘర్షణను సుస్పష్టంగా ప్రతిబింబించింది. ఒకవైపు కుటుంబ పరువు ప్రతిష్టలు, కట్టుబాట్లు మరోవైపు సోషలిస్టు భావజాలం తీసుకు వస్తున్న విన్నూతన ఆలోచనల మధ్య నలిగిపోతున్న సామాన్య జీవితాలు పొందే మానసిక ఘర్షణ, జమీల్యా లోని ప్రతీ అక్షరంలోను కనిపిస్తుంది.
 
==సాహిత్యంలో నవల స్థానం–అంచనా==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు