జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి నవల ప్రత్యేకతలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Stamps of Kyrgyzstan, 2009-577.jpg|250px|right]]
'''జమీల్యా''' చింగిజ్ ఐత్‌మాతోవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన [[నవలా సాహిత్యము|నవల]] . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది.సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
అప్పటి సమిష్టి వ్యవసాయ సంస్కృతి (collective farming culture) నేపథ్యంలో సమకాలీన గిరిజన సంస్కృతి జీవితాలను ప్రతిబింబించే ఒక మనోహరమైన ప్రేమ కథ ఇది. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు.<ref>Erich Follath and Christian Neef, "[http://www.spiegel.de/international/world/0,1518,druck-720631,00.html Kyrgyzstan Has Become an Ungovernable Country]", ''Der Spiegel|SPIEGEL ONLINE International'', 8 October 2010.</ref> 1958 లో కిర్గిజ్ భాషలోనూ, [[రష్యా|రష్యన్ భాష]]లోను, వెలువడిన ఈ చిన్న నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, పలు భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్‌మాతోవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.
 
==రచయిత విశేషాలు==
Line 29 ⟶ 30:
 
==నవల ప్రత్యేకతలు==
* ''ఈ నవల కిర్గిజ్ మధ్య సామాజిక సంబంధాలను చక్కగా వివరిస్తుంది.'' ముఖ్యంగా మధ్య ఆసియాలోని సంచార జాతులు స్థిరపడుతున్న ఒకానొక సంధి కాలంలో, కిర్గిజిస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో నెలకొన్న కుటుంబ సంబంధాలు, అల్లుకున్న జీవితాల గురించి సూక్ష్మమైన అంతర్దృష్టిని అందించడమే కాకుండా, కుటుంబం, వైవాహిక బందం, జీవితం, వాస్తవికత, నిజమైన ప్రేమ, జీవితం యొక్క ఆనందం తదితర అంశాల గురించిన అనేక ప్రశ్నలకు సమాధానాలను సృజనాత్మకంగా అన్వేషించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కిర్గిజ్ సంచార సంస్కృతులపై సోషలిస్టు సంస్కృతి ప్రభావం తీవ్రంగా వున్నప్పుడు ఆయా సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవిత సంక్లిష్టతలను ఈ నవల ప్రతిఫలించింది.
 
* ''ఈ నవల 1940 లలో సోవియట్ యూనియన్‌లోని సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది.'' ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ యుద్ధకాలంలో రాయబడ్డ ఈ కథ, యుద్ధం వలన కలిగే సామాజిక సంక్షుభిత పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తెలియచేస్తుంది. పురుషులంతా నిర్బంధంగా యుద్ధభూమికి తరలిపోవడాలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు లేని గ్రామాలు, యుద్ధరంగం నుండి ఏ రోజు, ఏ కబురు వినవలసివస్తుందో అని భయపడే వృద్ధులు, చెమర్చిన కళ్లతో తనయుల రాక కోసం ఆశగా ఎదురుచూసే తల్లులు, యుద్ధసమయంలో స్త్రీలు పడే కష్టాలు, భర్త దగ్గరలేని స్త్రీలకు ఎదురయ్యే వేధింపులు, బడులు మూసివేయడంతో కళాభిరుచులు చంపుకొంటూ కష్టించి పనిచేసే బాలలు, చిన్ననాటి ఆనందాలను కోల్పోతున్న పిల్లలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలోను సంక్షోభ పరిస్థితులతో నెట్టుకొస్తున్న వ్యధాభరిత జీవిత చిత్రణలు అడుగడుగునా ఈ నవలలో కనిపిస్తాయి. మరోపక్క "పండే ప్రతి గింజ యుద్ధభూమికే" అనే నినాదంతో, యుద్హంలో పాల్గొనే సైనికుల ఆహారం కోసం ప్రతీ కుటుంబం నుంచి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని తేడా లేకుండా యావన్మందీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో రాత్రింపగళ్ళు పనిచేయక తప్పని సామాజిక పరిస్థితులను మన కళ్ల ముందుంచుతుంది.
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు