జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

43 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
చి (నవల ముఖచిత్రం చేర్పు)
ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం (1940-45) కాలం నాటి సోవియట్ పాలనలో కిర్గిజ్ సంచార జాతుల సాంఘిక జీవన పరిస్థితులకు అద్దం పట్టిన ఈ కథను, సామాజిక కట్టుబాట్లను అధిగమించిన సాహసోపేతమైన ప్రేమకథగా మాత్రమే కాకుండా, అంతకు మించి సంక్షుభిత జన జీవితాలను సృజనాత్మకంగా ప్రతిఫలించే నవలగా, ఆధునికతకు, సంప్రదాయాలకు మధ్య తలెత్తే వైరుధ్యాలను స్పృశించిన నవలగా దీనిని పరిగణించారు.
 
నవల యొక్క సైద్ధాంతిక మరియు కళాత్మక స్వభావం కారణంగా, ఇది కిర్గిజ్ ప్రసంగ కళ (art of speech)నుకథాకౌశలాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడమే కాక, సృజనాత్మక వ్యక్తీకరణతో మధ్య ఆసియా ప్రజల ప్రసంగసృజనాత్మక కళకికథాకౌశలానికి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
ఈ చిన్న నవలలో చిత్రితమైన ఉదాత్త పాత్రలు, కళాత్మకత, జీవిత వాస్తవికత, సార్వజనీన మానవీయత, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, నిజమైన జీవితానంద విలువలు, అభ్యుదయ దర్శనాలు వంటి అంశాలు, తరాలు మారినా, అలనాటి పరిస్థితులు కనుమరుగైనా పాఠకుల ఆలోచనలను సంఘర్షింపచేసి తద్వారా మానవ సమాజాలను ప్రగతి పథంలో మరింత ముందుకు నడిపించడానికి దోహదం చేస్తాయి. ఈ లక్షణాలే జమీల్యా కథను ప్రపంచ సాహిత్యంలో ఉత్తమ క్లాసిక్ నవలలలో ఒకటిగా నిలబెట్టాయి.
7,465

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3032100" నుండి వెలికితీశారు