టి. కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి తొట్టెంపూడి కృష్ణ గ్రామం పేరు సవరణ
పంక్తి 16:
'''తొట్టెంపూడి కృష్ణ''' తెలుగు చలనచిత్ర ఎడిటర్, దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో '''టి.కృష్ణ''' గా ప్రసిద్దుడు.
==విశేషాలు==
ఈయన 1927లో [[వరంగల్లు జిల్లా]] [[రాయపర్తి|రాయిపర్తి]]లో జన్మించాడు. ఇతని తండ్రి మంచి పండితుడు. ఉభయభాషా ప్రవీణుడు. కృష్ణ తన [[మేనమామ]] మాజీ మంత్రి [[టి.హయగ్రీవాచారి]] ప్రోద్బలంతో నాటకాలలో ప్రవేశించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి 1948లో బి.ఎ. పూర్తి చేశాడు. కొంతకాలం [[గోలకొండ పత్రిక]]లో సినిమా సమీక్షలు వ్రాయడం, హైదరాబాదులోని ఆలిండియా [[రేడియో]]లో గ్రామస్తుల కార్యక్రమాలలో "లింగడు" అనే తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రను నిర్వహించడం వంటివి చేశాడు. సినిమాలలో పనిచేయాలనే బలమైన కోరికతో 1950లో మద్రాసు చేరుకున్నాడు. [[హెచ్.ఎం.రెడ్డి]] వద్ద దర్శకత్వశాఖలో అప్రెంటీస్‌గా చేరాడు. [[ఆదర్శం (1952 సినిమా)|ఆదర్శం]] అనే సినిమాలో [[సావిత్రి (నటి)|సావిత్రి]]కి జంటగా ఒక హాస్యపాత్రలో నటించాడు. అదే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఎం.వి.రాజన్ వద్ద ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. [[రాజ్ కపూర్]] తీసిన [[ప్రేమలేఖలు (1953 సినిమా)|ప్రేమలేఖలు]] సినిమాలో "ప్రాణ్"కు [[తెలుగు]]లో డబ్బింగ్ చెప్పాడు. [[అమర సందేశం]] చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా, అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. [[కృష్ణ ప్రేమ]] చిత్రంతో ఇతను పూర్తి స్థాయి ఎడిటర్‌గా మారి 30కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా ఉన్నాడు. ఇతడు దర్శకత్వం వహించిన తొలి సినిమా [[ఉపాయంలో అపాయం]]<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=ఎడిటర్, డైరెక్టర్ టి.కృష్ణ|journal=విజయచిత్ర|date=1 February 1974|volume=8|issue=8|pages=53-54|accessdate=16 May 2017}}</ref>. ఈయన [[ప్రతిఘటన]], [[రేపటి పౌరులు]], [[నేటి భారతం]] వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు<ref>http://www.imdb.com/name/nm0471453/</ref>. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన [[మలయాళం]]లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు [[తొట్టెంపూడి గోపీచంద్]] ఈయన కుమారుడే. ఈయన [[క్యాన్సర్]] వ్యాధితో బాధపడుతూ [[మే 8]], [[1987]] న మరణించాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/టి._కృష్ణ" నుండి వెలికితీశారు