బొబ్బిలి రాజా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మూలం, మూలాల మూస చేర్పు ట్యాగు: 2017 source edit |
కథ చేర్చాను ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 18:
== కథ ==
సుందరయ్య ఒక ప్రజాసేవకుడు. వాళ్ళ ఎదురింట్లో ఉండే రాజేశ్వరి దేవి కోటీశ్వరురాలు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని ఆమె కోరిక. సుందరయ్య ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబెడతాడు. సుందరయ్యకు ప్రజాబలం ఉండటం వల్ల ఆయన చేతిలో తాను ఓడిపోతానని భావించిన రాజేశ్వరి దేవి సుందరయ్య కుటుంబంపై చెడు ప్రచారం చేస్తుంది. సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి రాజేశ్వరి తమ్ముడు సూర్యం ప్రేమించుకుని ఉంటారు. ఫలితంగా రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని బజారుకీడుస్తుంది. ఈ విషయం తెలిసిన సూర్యం, అహోబలరావుల మధ్య గొడవ జరిగి సూర్యం మేడ మీద నుంచి పడిపోయి మరణిస్తాడు. ఆ హత్యను సుందరయ్య, రాజ్యలక్ష్మి మీద వేసి వాళ్ళను జైలుకు పంపిస్తుంది రాజేశ్వరి దేవి. అక్కడ ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి మీద బలాత్కారానికి ప్రయత్నించడంతో అతన్ని హత్య చేసి తండ్రితో కలిసి అడవిలోకి పారిపోతుంది రాజ్యలక్ష్మి.
రాజ్యలక్ష్మి కొడుకు రాజా తన అమ్మ, తాతలతో కలిసి అడవిలో నివసిస్తూ ఉంటారు. రాణి మంత్రియైన రాజేశ్వరి దేవి కూతురు. స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళిన రాణికి రాజా గైడుగా వస్తాడు. మొదట్లో తగాదాలతో పరిచయమైన వారి స్నేహం ప్రేమగా మారుతుంది. తన తల్లిని అవమానించిన రాజేశ్వరి దేవి కూతురినే తాను ప్రేమించిందని తెలుసుకున్న రాజా తర్వాత ఏంచేశాడు, ప్రేయసీ ప్రియులు ఎలా ఒక్కటయ్యారు అన్నది మిగతా కథ.
== తారాగణం ==
* రాజాగా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* రాణిగా [[దివ్యభారతి]]
* రాజేశ్వరి దేవిగా [[వాణిశ్రీ]]
* [[బ్రహ్మానందం]]
* సుందరయ్యగా [[గుమ్మడి]]
* [[కైకాల సత్యనారాయణ]]
* అహోబలరావుగా [[కోట శ్రీనివాసరావు]]
* రాజ్యలక్ష్మిగా సుమిత్ర
* సూర్యంగా విద్యాసాగర్
== పాటలు ==
|