ఓటీటీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ/ ఓటీటీ
(తేడా లేదు)

10:20, 16 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఓటీటీ అంటే ఇంటర్నెట్ మీద ఆధారపడి సినిమా లేదా ఇతర మీడియా సంబంధిత కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫాం. దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలతో పాటుగా, వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలెబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు. అయితే వినియోగదారులు ఓటీటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వినోదభరిత కార్యక్రమాలు చూడొచ్చు.

ఓటీటీ వేదికలకు మొదట ప్రజాదరణ అమెరికా లాంటి సంపన్న దేశాలలో మొదలైంది, మెల్లగా అది అన్ని దేశాలకు విస్తరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హాళ్లు లేనందున భారతదేశంలో కొత్త సినిమాలు ఓటీటీ పై విడుదల చేయడం జరుగుతుంది.

ఓటీటీ ప్రయోజనాలు

  • ఇది కేవలం ఇంటర్నెట్ పై ఆధారపడి నడిచే వేదిక, అందువల్ల అంతరాయం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగదారుడికి నచ్చిన కార్యక్రమాలు చూడొచ్చు.
  • ఖర్చు తక్కువ, సౌలభ్యం ఎక్కువ
  • ఎలాంటి ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్, ఇతర కార్యక్రమాలు చూడొచ్చు
  • కొన్ని ఓటీటీలలో టీవీ చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం కూడా చూడొచ్చు

బయటి లింకులు

ఓటీటీ- డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్

"https://te.wikipedia.org/w/index.php?title=ఓటీటీ&oldid=3033188" నుండి వెలికితీశారు