వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి
పంక్తి 95:
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం పూర్తిగా వ్యతిరేకించాను. అయిన గురువు గారికి ఓటు అనుకూలమే, అందరూ వ్యతిరేకించిన అనుభవజ్ఞులు అంత పట్టుబట్టడం వెనక ఏదో ఉంది, ఓటింగ్ కు మందు విషయం చెప్పకపోయినా ఓటింగ్ గడువు తర్వాత వివరిస్తారా ఆశిస్తూ... ఓటింగ్ విఫలమైతే 70శాతం యధావిధి సఫలమైతే చూడాలి అక్షర కాలుష్యం ఆరంభమవుతుందా లేక మంచి వ్యాసాలు కొత్తగా తేవి లోనికి చేరుతాయా... కాలచక్రం నిర్ణయం చేస్తుంది. [[User:Chaduvari|చదువరి]], [[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]],[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]], [[వాడుకరి:యర్రా రామారావు|రామారావు]], [[వాడుకరి:Pranayraj1985|ప్రణయరాజ్]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], మీరంటే అంటే నాకు చాలా ఇష్టం... వికీలో మీ శ్రమ, మీ స్పీడు, మీ అంకితభావం...మీ సహనం సామాన్యమైనది కాదు. ఈ విషయంలో క్షమించండి. గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే.[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల |<span style="text-shadow:grey 1px 1px;"><font color="red"><sup></sup>&nbsp;ప్రభాకర్ గౌడ్ నోముల</font></span>]] 06:26, 16 సెప్టెంబరు 2020 (UTC)
:[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాద వ్యాసాల నాణ్యత ప్రాజెక్టు పేజీ తయారైన పిదప ప్రస్తుత విధానంపై సమీక్షను, కొత్త ప్రతిపాదనలను మూడువారాలపాటు చర్చించడం జరిగినది. చర్చను నిర్మాణాత్మకంగా జరపటంలో సహకరించని కొంతమంది సభ్యులు ఓటు ప్రక్రియను బలహీనపరచేవిధంగా ఓటు ప్రక్రియ కాలంలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఓటు ప్రక్రియ ముగిసిన తరువాత కూడా అభ్యంతరాలు తెలపవచ్చు. నా ఆసక్తి ప్రతిపాదన ఓడిందా, గెలిచిందా అన్నది కాదు. ఒకవేళ వోడితే 60 రోజుల తరువాత ఇంకొక కొత్త ప్రతిపాదన మొదలు పెట్టవచ్చు. గెలిచినా ప్రతికూలాలు ఎక్కువగా కనబడితే ప్రస్తుత విధానాన్నే మరల తేవాలని కొత్త ప్రతిపాదన చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వికీ చర్చలు, విధానాల నిర్ణయంలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనేలా చేయడం, వికీచర్చలు సామరస్యంగా, అందరికీ అర్ధవంతమయ్యేలాగా జరపటం. వాటిలో ఎక్కువమంది సభ్యులు పాల్గొంటేనే వికీ ఎక్కువకాలం అభివృద్ధి దిశగా కొనసాగగలుగుతుంది. ఎంతో మంది వికీకృషిని ప్రభావితం చేసే విధానం, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వని కొద్దిమంది తమ అభిప్రాయాల అధారంగా చేయాలనడానికి నేను విరుద్ధం. విస్తృత సముదాయ చర్చల ఫలితంగా ఏర్పడిన పద్ధతులను గౌరవించడం కూడా చాలా ముఖ్యం. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:21, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
==వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి==
సర్, ఒక పక్క చర్చ ముగిసిపోయిన తరువాత, సదరు ప్రతిపాదనపై వోటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వున్నప్పుడు ఓటింగులో పాల్గొన్న కొంతమందిని చిన్న చూపు చూడటం బాగోలేదు. రచ్చబండలో చేస్తున్న వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి. వోటింగ్ మధ్యలో వున్నప్పుడు ప్రతిపాదనకు మద్దతుగా నిలిచిన వారిని, ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ కేవలం 11 అనువాదాలు మాత్రమే చేసిన వ్యక్తులుగా...., అనువాద దోషాలను ఓరకంటా కూడా చూడని వ్యక్తులగా...., ఈగోతో హుంకరించే స్థాయి వ్యక్తులగా...... పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరుల.....ఇలా నిర్వాహకులే ఒక ప్రతిపాదనకు మద్దతుగా ఓటు వేసినవారిని పేర్కొంటూ చులకన చేస్తే ఏలాగండి? పైగా నిర్వాహక స్థాయిలో వున్న అనుభవజ్ఞులు కనీసం వోటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా రచ్చబండలో "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై కామెంట్స్ పాస్ చేయకుండా, కాస్త సంయమనం పాటించండి. సభ్యులుగా కొన్ని నిర్దిష్ట అర్హతలున్నవారు ఓటింగులో పాల్గొనవచ్చు. అలా ఓటు వేసే అవకాశం ఉందనుకొనే వచ్చాం. తీరా ఓటింగులో పాల్గొనేసరికి ఒకసారి కూడా అనువాదం చేయనివారు, కొన్ని అనువాదాలు చేసినవారు అంటూ చిన్నబుచ్చినట్టు మాట్లాడడటం భావ్యం కాదు. మీరు 10 లక్షల బైట్లుకు పైగా అనువాదం చేసి ఉండవచ్చు. నిస్సందేహంగా గొప్ప అనుభవజ్ఞులు మీరు. తెలుగు వికీలో అందరూ గుర్తించే స్థాయి మీది. అంగీకరించాల్సిన విషయాన్ని అంగీకరిస్తున్నాం. కానీ అది చర్చలో అభిప్రాయాలు ఎక్స్చేంజి చేస్తున్నప్పుడు మాత్రమే పరిగణించండి. అక్కడ మమ్మలి కావచ్చు. మాబోటి తక్కువ అనుభవం వున్న వారిని కావచ్చు. చర్చలో భాగంగా చెప్పండి. ఒప్పుకుంటాం. కానీ చర్చ ముగిసిపోయి ఓటింగు క్యూ లో వున్నప్పుడు అందరూ సమాన ప్రతిపత్తులతో ఓటు వేస్తాము. అక్కడ అనుభవజ్ఞులకని 10 అదనపు ఓట్లు కానీ, అనుభవం లేని మా వంటివారికి ఒక ఓటు అని ఉండదు. నిర్దిష్ట అర్హత వున్న ప్రతీ సభ్యుడూ సమాన ప్రతిపత్తితో ఓటు హక్కు కలిగివుంటారు కాబట్టి ఈ టైం లో ఓటు వేసినవారిని అనుభవం లేనివారని, కొద్ది అనువాదాలు మాత్రమే చేసినవారని చులకనగా చూడవద్దు. ఒకవేళ అనువాదాలు గురించి మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియవు కావున మావంటివారు వోటింగ్ ద్వారా అనువాద విధానాన్ని ప్రభావితం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వంటివి ఏమైనా ఉంటే, మాబోటివారిని ముందుగానే వోటింగ్ అర్హతలు తొలగించండి. మీరు కోరుకున్న సంఖ్యలో అనువాదాలు చేసిన వారికి మాత్రమే, అనువాదంలో విశేష అనుభవం వున్న సభ్యులకే ఓటు హక్కు ఉండాలనే నియమం పెట్టండి. సలక్షణంగా తప్పుకొనిపోతాం సర్. ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఓటర్ స్థాయిలో గుర్తిస్తున్నప్పుడు, ఓటు వేయడం మాకు నొప్పిస్తున్నది. కొద్దిగా గుర్తించండి.
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 01:24, 17 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".