వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి
చి చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?
పంక్తి 99:
సర్, ఒక పక్క చర్చ ముగిసిపోయిన తరువాత, సదరు ప్రతిపాదనపై వోటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వున్నప్పుడు ఓటింగులో పాల్గొన్న కొంతమందిని చిన్న చూపు చూడటం బాగోలేదు. రచ్చబండలో చేస్తున్న వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి. వోటింగ్ మధ్యలో వున్నప్పుడు ప్రతిపాదనకు మద్దతుగా నిలిచిన వారిని, ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ కేవలం 11 అనువాదాలు మాత్రమే చేసిన వ్యక్తులుగా...., అనువాద దోషాలను ఓరకంటా కూడా చూడని వ్యక్తులగా...., ఈగోతో హుంకరించే స్థాయి వ్యక్తులగా...... పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరుల.....ఇలా నిర్వాహకులే ఒక ప్రతిపాదనకు మద్దతుగా ఓటు వేసినవారిని పేర్కొంటూ చులకన చేస్తే ఏలాగండి? పైగా నిర్వాహక స్థాయిలో వున్న అనుభవజ్ఞులు కనీసం వోటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా రచ్చబండలో "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై కామెంట్స్ పాస్ చేయకుండా, కాస్త సంయమనం పాటించండి. సభ్యులుగా కొన్ని నిర్దిష్ట అర్హతలున్నవారు ఓటింగులో పాల్గొనవచ్చు. అలా ఓటు వేసే అవకాశం ఉందనుకొనే వచ్చాం. తీరా ఓటింగులో పాల్గొనేసరికి ఒకసారి కూడా అనువాదం చేయనివారు, కొన్ని అనువాదాలు చేసినవారు అంటూ చిన్నబుచ్చినట్టు మాట్లాడడటం భావ్యం కాదు. మీరు 10 లక్షల బైట్లుకు పైగా అనువాదం చేసి ఉండవచ్చు. నిస్సందేహంగా గొప్ప అనుభవజ్ఞులు మీరు. తెలుగు వికీలో అందరూ గుర్తించే స్థాయి మీది. అంగీకరించాల్సిన విషయాన్ని అంగీకరిస్తున్నాం. కానీ అది చర్చలో అభిప్రాయాలు ఎక్స్చేంజి చేస్తున్నప్పుడు మాత్రమే పరిగణించండి. అక్కడ మమ్మలి కావచ్చు. మాబోటి తక్కువ అనుభవం వున్న వారిని కావచ్చు. చర్చలో భాగంగా చెప్పండి. ఒప్పుకుంటాం. కానీ చర్చ ముగిసిపోయి ఓటింగు క్యూ లో వున్నప్పుడు అందరూ సమాన ప్రతిపత్తులతో ఓటు వేస్తాము. అక్కడ అనుభవజ్ఞులకని 10 అదనపు ఓట్లు కానీ, అనుభవం లేని మా వంటివారికి ఒక ఓటు అని ఉండదు. నిర్దిష్ట అర్హత వున్న ప్రతీ సభ్యుడూ సమాన ప్రతిపత్తితో ఓటు హక్కు కలిగివుంటారు కాబట్టి ఈ టైం లో ఓటు వేసినవారిని అనుభవం లేనివారని, కొద్ది అనువాదాలు మాత్రమే చేసినవారని చులకనగా చూడవద్దు. ఒకవేళ అనువాదాలు గురించి మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియవు కావున మావంటివారు వోటింగ్ ద్వారా అనువాద విధానాన్ని ప్రభావితం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వంటివి ఏమైనా ఉంటే, మాబోటివారిని ముందుగానే వోటింగ్ అర్హతలు తొలగించండి. మీరు కోరుకున్న సంఖ్యలో అనువాదాలు చేసిన వారికి మాత్రమే, అనువాదంలో విశేష అనుభవం వున్న సభ్యులకే ఓటు హక్కు ఉండాలనే నియమం పెట్టండి. సలక్షణంగా తప్పుకొనిపోతాం సర్. ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఓటర్ స్థాయిలో గుర్తిస్తున్నప్పుడు, ఓటు వేయడం మాకు నొప్పిస్తున్నది. కొద్దిగా గుర్తించండి.
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 01:24, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
==చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?==
చర్చలు ముగిసిపోయాయి. ఓటింగు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దీనిపై అప్పడు జరిగిన చర్చలో వీలుని బట్టి కొందరు సభ్యులు పాల్గొంటారు. కొందరు పాల్గొన లేకపోవచ్చు. చర్చలో పొల్గొనలేకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా. దానిని పాయింట్ అవుట్ చేయడం భావ్యం కాదు. ఒక చర్చలో ఎవరెవరు ఏ, ఏ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాద ప్రతివాదనలను ఆ చర్చ ముగిసిన తరువాత అయినా సభ్యులు తెలుసుకొనే అవకాశం వుంది. ఓటింగు ప్రక్రియలో పాల్గొనే వారు ఆ విధంగా తెలుసుకొని కూడా ఓటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే తీరా వోటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు, చర్చలో అప్పుడు వాళ్ళు participate చేయలేదు అనే పాయింట్ రాకూడదు. ఉదాహరణకు పార్లమెంట్ చర్చలు చూడండి. ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అనుభవజ్ఞులు, ఆ సబ్జెక్టు మీద కమాండ్ వున్న సభ్యులు మాత్రమే చర్చలో వాడి,వేడిగా పాల్గొనడం చూస్తాం. మిగిలిన సభ్యులు తమకు ఆశక్తి ఉన్నమేరకు మాత్రమే చర్చలో పాల్గొంటారు. లేదా సభకు గైరుహాజరు కూడా అవుతారు. అయితే చర్చానంతరం వోటింగ్ నిర్వహించినపుడు సభ్యులందరికి (చర్చలో పాల్గొన్న వారికి, పాల్గొనని వారికి కూడా) సమానస్థాయిలో వోటింగ్ హక్కు ఉంటుంది. చర్చలో పాల్గోలేదని, అనుభవం లేదని, కొద్ధి అనుభవం వున్న సభ్యులు కూడా ఓటింగులో పాల్గొన్నారని ... సంబంధిత టెక్నాలజీ పరికరం వాడని/తక్కువ వాడి ఓటింగులో పాల్గొన్న వారని ... ఇలా ఓటింగులో పాల్గొన్నందుకు తోటి సభ్యులను అనుభజ్ఞులైన నిర్వాహకులు చిన్న చూపుగా చూడటం.... ఇబందిగా వుంది.
 
సర్ చర్చలో పాల్గొనడం వేరు. ఓటింగులో పాల్గొనడం వేరు. ఈ విషయం మీద నాకు తెలిసిన రెండు విషయాలు చెపుతాను. చర్చ (డిబేట్) అనేది ప్రాధమికంగా Exchange of different opinions. కానీ ఓటింగ్ అనేది choosing of a particular opinion. డిబేట్ లో అంతిమంగా వెలువడేది కేవలం ఒపీనియన్ మాత్రమే. ఏకాభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం, భిన్నాభిప్రాయం ... ఇలా ఏదైనప్పటికీ, చర్చలో వెలువడేది అభిప్రాయం మాత్రమే. అభిప్రాయాలను ఎక్స్చేంజి మాత్రమే చేయగలం కానీ ఒక నిర్ణయంగా ప్రకటించలేము. డిబేట్ లో ఒక అభిప్రాయం కేవలం వోటింగ్ తోనే నిర్ణయంగా మారుతుంది. చట్టబద్దత అనేది నిర్ణయాలకు ఉంటుంది కానీ అభిప్రాయాలకు ఉండదు. అందుకే డిబేట్ లో అంతిమంగా వెలువడిన ఏ అభిప్రాయానికి అయినా చట్టబద్దత కలిగించడానికి, ఆ డిబేట్ చివరలో వోటింగ్ నిర్వహిస్తారు. ఒక చర్చలో మొత్తం సభ్యులందరు పాల్గొన్నప్పటికీ ఆ చర్చా ఫలితం మొత్తం సభ్యులందరికీ శిరోధార్యం కాబోదు ఎందుకంటే ఆ చర్చా ఫలితం ఏదో ఒక రూపంలో వున్న ఒపీనియన్ మాత్రమే. ఒక చర్చానంతరం ఓటింగులో కొద్దిమంది మాత్రమే (Quorum ఉండాలి) పాల్గొని ఓటు వేసినప్పటికీ ఆ ఓటింగ్ ఫలితాన్ని (ఓటు వేసిన, వేయని సభ్యులతో సహా) మొత్తం సభ్యులందరూ శిరసావహించాల్సిందే. ఎందుకంటే అది నిర్ణయం రూపంలోకి మారిపోయింది కాబట్టి. వికీపీడియాలోనే కాదు, ఎవరైనా సామరస్యంగా ఉంటుందని డిబేట్ వరకూ సూచిస్తారు. చర్చ వాడి, వేడిగా కొనసాగినపుడు మాత్రం వోటింగ్ ను సూచిస్తారు. అయితే law of natural justice ప్రకారం వోటింగ్ కు ముందు ఒక చర్చ జరగడం తప్పనిసరి చేస్తారు. వికీలో కూడా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చు అనే నియమం ఉందని పెద్దలు కూడా చెపుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న వోటింగ్ కు ముందుగా ఒక చర్చ జరిగింది. అయితే చర్చలో విస్తృతంగా పాల్గొన్న అనుభవజ్ఞలైన సభ్యులు ఇది చర్చతోనే ఆగిపోవాలని ఎందుకు అంతగా కోరుకుంటున్నారు? వోటింగ్ కు ఎందుకు కాదంటున్నారు.
--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 01:42, 17 సెప్టెంబరు 2020 (UTC)
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".