"హెర్బెర్ట్ మార్కూస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
హెర్బెర్ట్ మార్కూస్
 
{{Infobox person
| name = హెర్బెర్ట్ మార్కూస్ (Herbet Marcuse)
| citizenship = జర్మని
| parents =
| notable_works = ది వన్ డైమంషనల్డైమన్‌షనల్ మాన్
| style = [[తత్త్వవేత్త]]
| signature =
}}
 
'''హెర్బెర్ట్ మార్కూస్ ''' ప్రముఖ జర్మన్ తత్తవెత్త, సామాజిక వాది, జీవితానంద తత్త్వవేత్త.
 
== '''జీవిత విశేషాలు''' ==
హెర్బెర్ట్ మార్కూస్ 1898 జూలై 19వ తేదీన బెర్లిన్ లో భాగ్యవంతులయిన తల్లితండ్రులకు జన్మిచాడు. [[మొదటి ప్రపంచయుద్ధం]] ఆఖరులో సైన్యం నుంచి విడుదల అయిన తరువాత క్రియాశీల రాజకీయాలలో కొంతకాలం ఆయన పాల్గొన్నాడు. బెర్లిన నగరంలో సోల్ డర్ఫ్ కౌంసిలో లో ఆయన సభుడుగా ఉండేవాడు. అంతకు రెండు సంవత్సరాలకు మునుపు ఆయన చేరిన సోషిల్ డెమాక్రాటిక పార్టీకి 1919లో రాజీనామా ఇచ్చాడు. కర్మిక వర్గానికి ఆపార్టీ ఆదశలో ప్రాతినిధ్యం వహించడంలేదని ఆయన అభిప్రాయబడ్డాడు. [[జర్మన్ విప్లవం]] విఫలమయిన తరువాత ఆయన రాజకీయలనుంచి పూర్తిగా వైదొలగి బెర్లిన్, ఫ్రీబర్గ్ లలో తత్త్వశాస్త్రం అధ్యయనం చేసాడు.మార్టిన్ హెయ డెగ్గర్ ఆయన ఉపాధ్యాయులలో ముఖ్యుడు.మార్కూస్ వ్రాసిన మొదటి పెద్ద గ్రంధం హెగెల్ సత్యతత్వ విచారం గురుంచి. 1932లో ప్రచురితమయిన ఆగ్రద్ంహంపై హెయ్ డెగ్గర్ ప్రభావం స్పష్టంగా వున్నది. జర్మనిలో సంభవించిన రాజకీయ పరిణామం అర్ధం ఏమిటంటే - మార్కూస్, హెయ్ డెగ్గర్ మధ్య అనివార్యమయిన చీలిక. హెయ్ డెగ్గర్ మరణించేవరకు మార్కూస్ ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. ఫ్రీబర్గ్ లో హెయ్ డెగ్గర్ వద్ద విద్యా శిక్షణ పొందిన విద్యార్దులెవరూ ఆయన సిద్దాంతంలోని ఫాసిస్టు ధోరణిని 1932 వరకూ గ్రహించలేదని ఒక ఇంటర్వూలో మార్కూస్ చెప్పాడు.
 
ఫ్రాంక్‌ఫర్ట్ లోని ఇంసిట్యూట్ ఆఫ్ సోషల్ రిసర్చ్‌లో 1933 నాటికే మార్కూస్ సభ్యుడు. పాల్ టిలచ్, కారల్ మాన్‌హీం, హ్యూగో లతో పాటు అధికారికంగా ఆసంవత్సరం ఏప్రిల్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బహిష్కృతులయిన వారిలో మార్కూస్ మొదటి వ్యక్తి. మార్కూస్ తరువాత జనీవాకు వలస వెళ్ళాడు. ఒక సంవత్సరం తరువాత న్యూయార్క్ కు వెళ్ళాడు.అక్కడి కొలంబియా యూనివర్సిటీ ఇన్సిట్యూట్ ఆఫ్ సోషిల్ స్టడీస్ లో సభ్యుడు అయ్యాడు. 1942 నాటి నుంచి 50 వరకూ వాషింగ్టన్ లో విదేశవ్యవహారాల శాఖాధిపతిగా పనిచేశాడు.ఆ తరువాత కొలంబియా ఇన్సిట్యూట్ లోనూ, హార్వార్డ్ లోనూ ఆయన అధ్యాపకుడిగా పనిచేశాడు.బోస్టన్ లోని బ్రాండీస్ యూనొవర్సిటీలో ప్రొఫసర్ గా అప్పుడు నియమితుడయినాడు.సాండిగో కాలిఫోర్నియాలో తత్త్వశాస్త్రం ప్రొఫసర్ గా 1955లో నియమితుడయినాడు.
 
ఆతరువాతనే ఆయన వ్రాసిన రెండు గ్రంధాలు '''ది వన్ డైమన్‌షనల్ మాన్ [[one-dimensional man]]''', '''ఇరోస్ అండ్ సివిలిజేషన్ [[Eros and Civilization]]''' చాలా ప్రాచుర్యం పొందినాయి. 1960 తర్వాత సంవత్సరాలలో అమెరికా స్వామ్రాజ్యవాదానికి విరుద్ధంగా ప్రపంచ వ్యాప్తంగా ఆక్షేపణ ప్రకటించాలని పిలుపునిచ్చిన కొత్తవామ పక్షం గ్రంధాలలో ఆరెండూ ప్రమాణ గ్రంధాలయినవి కూడా. ఎంత అవినీతికర దశలో సంఘం ఉన్నదో విశ్లేషించి నప్పటికీ దాన్ని అభిగమింనాడికి ఉపయోగపడే సూచన యేమీ చేయజాలక పోయిన అడోర్నో, హెయ్‌ర్ కీమర్ ల నిరాశావాదం మార్క్యూస్ కు నమ్మకం లేదు.ఎక్కడో అమలు జరుగుతున్న సోవియట్ కమ్యూనిజమ్ లేదా సోషియలిజమ్ ముక్తిని ప్రసాదిస్తుందని మార్కూస్ అభిప్రాయ పడలేదు కూడా. మార్కూస్ వ్రాసిన ది వన్ డైమన్‌షనల్ మాన్ పరస్పర విరుద్ధాంశాలమయమయిన '''పెట్టుబడిదారీ విధానం''' లో కొత్త సాంకేతిక విధానలను రూపొందించడం ద్వారా సంక్షోభాలను ఇంకా సమర్ధవంతంగా ఎదుర్కొని వ్యవస్థను స్థిరీకరించి పెద్ద ప్రమాదాలను నిరోధించడం సాధ్యపడినదని తన గ్రంధంలో ఆయన వివరించాడు. ఉత్పత్తి ప్రక్రియలో నిమగ్నులయిన వారిచేత లక్ష్యానికి అనుగుణంగా పని చేయించడం, వారందరూ కలిసి వచ్చెటట్లు చూడడం ముఖ్యం అంటాడు మార్కూస్. చాలీ చాలని ఆర్జనలతో బ్రతికెవారే స్వేచ్చను సంపాదించగలరని మార్కూర్ తుదివరకూ నమ్మారు.కొత్త సాంకేతిక పద్దతుల నిర్మాణాత్మక శక్తిపట్ల మార్కూస్ కు అపరిమిత విశ్వాసం. ఈవిషయంలో అభ్యుదయంలో నమ్మకం ఉన్న కల్తీలేని సిసలయిన మార్‌క్సిస్ట్. ఆయన తమను తాము మరచిపోయి, మరొకరితో తాదాత్మ్యం చెందవలసిన దుస్థితి లేకుండా తమ నిజావసరాల కనుగుణంగా ఇంకా ఎక్కువమంది జీవించడానికి వీలుగా మన జీవితాన్ని మనం గుర్తించే అవకాశాన్ని సైన్సు, టెక్నాలిజి ఇస్తున్నాయని ఆయన అభిప్రాయం.
 
ఇలా మార్కూస్, ఎరిక్‌ఫ్రాన్ లు ఆచరణలో చూపించినట్టు మనస్తత్త్వ విశ్లేషణా (సైకో అనాలిసస్) పద్దతిని మార్క్సిస్ట్ ఆలోచనలతో కలపడం తాత్విక రంగంలో సాహసమే. 1910 తర్వాత సంవత్సరాలలో అలాంటి పద్దతి సాధ్యమని వూహించడమయినా కష్టమే. విధ్వంసం కోసం మనం జీవించడం లేదని ఫ్రాయిడ్ చెప్పాడని మార్కూస్ వాదన. మరణం లక్ష్యం విధ్వంసం ఒక్కటే కాదు-విధ్వంసం ఆవశ్యకతను అధగమించడం. క్లుప్తంగా చెప్పాలంటే మృత్యు వాంఛ లక్ష్యం జీవితానికి పరిసమాప్తం కాదు. బాధలు పూర్తికావడం. అంటాడు మార్కూస్.
 
==మూలములు==
* 1979 భారతి మాస పత్రిక. వ్యాసము: హెర్బెర్ట్ మార్కూస్-వ్యాస కర్త: శ్రీ. వి.ఎస్. అవధాని.
686

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3035098" నుండి వెలికితీశారు