కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: కొన్ని వాక్యాలు తిరగరాశాను
ట్యాగు: 2017 source edit
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 3:
image = Kobbari Bondam.jpg |
director = రవితేజ కాట్రగడ్డ|
writer = [[దివాకర్ బాబు]] (మాటలు), [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] (కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం)|
producer = [[కె. అచ్చిరెడ్డి]], వి. జి. సరోజ (సహ నిర్మాత) |
year = 1991|
పంక్తి 11:
cinematography = ఎన్. సుధాకర్ రెడ్డి|
music = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]|
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[నిరోషా]]|
}}
 
'''కొబ్బరి బోండాం''' 1991 లో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=youtube.com>{{cite web|title=యూట్యూబులో కొబ్బరి బోండాం సినిమా|url=https://www.youtube.com/watch?v=xcUb4AM0x0g|website=youtube.com|accessdate=23 October 2017}}</ref> ఇందులో [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్]], [[నిరోషా]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మొదటిసారిగా కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, సంగీతం అందించిన [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] తర్వాత దర్శకుడిగా మారి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు. [[రాజేంద్రుడు-గజేంద్రుడు|రాజేంద్రుడు గజేంద్రుడు]] ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. ఒక పిరికి వాడైన కథానాయకుడిని ఒక ప్రొఫెసరు ఆత్మవిశ్వాసం కలిగేలా చేసి అతని ఇబ్బందులు తొలగేలా చేయడం ఈ చిత్ర కథాంశం.
 
== కథ ==
పంక్తి 22:
ఉద్యోగం సంపాదించడం కోసం సర్వనామం దగ్గరికి వెళతాడు రాజు. సర్వనామం దొంగతనంగా తీసిన వీడియో క్యాసెట్లను వేరే వాళ్ళకు ఇచ్చి డబ్బులు వసూలు చేసే పని అప్పచెబుతాడు. కానీ సర్వనామం కొడుకు సురేష్ రాజును మోసం చేసి ఆ డబ్బును తస్కరిస్తాడు. సర్వనామం ఆ డబ్బు ఎలాగైనా కట్టమని రాజును నిలదీస్తాడు. రాజు ఏమీ చేయలేకపోవడంతో సర్వనామం రాజు తల్లిని పిలిచి అతని ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రాజు తల్లి అతన్ని నిలదీస్తుంది. డబ్బు కట్టే దాకా రాజు తల్లి తన దగ్గరే ఉంటుందని చెబుతాడు సర్వనామం. తన దగ్గర సూట్ కేసు డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎదురైనా తన పిరికితనంతో వారిని ఏమీ చేయలేకపోతాడు రాజు. మేఘమాల కూడా అతని చేతకానితనాన్ని చూసి హేళన చేస్తుంది. నిస్సహాయ స్థితిలో రాజు ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని లంకె బిందెల ఆచూకీ కోసం పాత పుస్తకాలన్నీ చదువుతాడు. ఒక ప్రాంతం ఆచూకీ తెలుసుకుని సహాయం కోసం కాలేజీలో పనిచేసే తన ప్రొఫెసరు దగ్గరికి వెళతాడు. ఆయన ఆ ప్రాంతం చేరుకోవడం కోసం ఒక మ్యాపు గీసిస్తాడు. రాజు దాన్ని వెతుక్కుంటూ వెళతాడు. అక్కడి లంకెబిందెలేవీ దొరకవు కానీ ఒక పాత నాణెం దొరుకుతుంది. ప్రొఫెసరు ఆ నాణేన్ని పరిశీలించి అది మగధ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక అదృష్ట సూచకమైన నాణెమనీ, అది ఎవరి దగ్గర ఉంటే వారికి కొండంత ఆత్మ విశ్వాసం వస్తుందనీ చెబుతాడు.
 
రాజు ఆ నాణెం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తన దగ్గర డబ్బు దొంగిలించిన దొంగలను మట్టి కరిపించి సురేష్ ను నేరం ఒప్పుకునేలా చేస్తాడు. సర్వనామం మాత్రం తన కొడుకు డబ్బు దొంగిలించాడని ఒప్పుకోడు. సర్వనామాన్ని బెదిరించి తల్లిని తీసుకెళ్ళాలని చూస్తాడు రాజు. ఆమె మాత్రం అతనికివ్వాల్సిన డబ్బు ఇచ్చేసి తనను తీసుకెళ్ళడం న్యాయమని చెబుతుంది. రాజు ప్రొఫెసరు సలహాతో సర్వనామం దగ్గర్నుంచి తెలివిగా డబ్బు కొట్టేసి ఆ దొంగతనాన్ని సురేష్ మీదకి నెట్టేస్తాడు. ఆ డబ్బుతో తన తల్లిని విడిపించుకుని తీసుకువచ్చి ప్రొఫెసరు ఇంట్లో ఉంచుతాడు.
 
రాజు మేఘమాల అన్నయ్య దగ్గరకు వెళ్ళి డబ్బు లేకుండానే అతని చెల్లెల్నిచ్చి పెళ్ళి చేయాల్సిందేనని పట్టుపడతాడు. అతన్ని ఒప్పించేందుకు రాజు తనకు ముందుగా జరగోబోయేవి తెలుసనీ అతని చావు తేదీ చెబుతానంటూ నానా రకాలుగా ఇబ్బందులు పెడతాడు. ఈలోపు కపూర్ వచ్చి రాజును బాక్సింగ్ ఆటలో చంపించి ఆ వీడియోను సొమ్ము చేసుకుందామని సర్వనామంతో చెబుతాడు. సర్వనామం తన కొడుకును పంపి రాజును ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ రాజు అందుకు ఒప్పుకోడు. కపూర్ మేఘమాల అన్నయ్యకు ఫోన్ చేసి ఒక్క రోజులో తనకివ్వాల్సిన ఐదు లక్షలు ఇవ్వమంటాడు. దాంతో మేఘమాల అన్నయ్య ఎప్పుడో తాము కపూర్ కు బాకీ ఉన్న విషయం గురించి, అందుకు అతను బెదిరిస్తున్న విషయం ఇద్దరికీ చెబుతాడు. బాకీ తీర్చడం కోసం రాజు సర్వనామం దగ్గరికి వెళ్ళి వీడియోలో నటించడానికి ఒప్పుకుంటాడు. ఈ లోపు సురేష్ రాజు దగ్గర ఉన్న అదృష్ట నాణేన్ని తస్కరించి స్నేహితులు అడగబోతే దానిని మింగేస్తాడు.
 
ఆత్మవిశ్వాసంలో బరిలోకి దిగిన రాజు నాణెం తన దగ్గర లేదనే విషయం తెలియగానే నీరుగారిపోయి చావు దెబ్బ తింటాడు. ఈలోపు నాణేన్ని మింగిన సురేష్ ప్రొఫెసర్ కంటబడటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని పరుగున వెళ్ళి మరో నాణేన్ని రాజుకిచ్చి అదే అతని అదృష్ట నాణెంగా నమ్మిస్తాడు. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రాజు అవలీలగా శత్రువును మట్టికరిపిస్తాడు. ఈలోపు పోలీసులు వచ్చి సర్వనామాన్ని, కపూర్ ను అదుపులోకి తీసుకుంటారు. అసలు ఆ నాణెంలో అసలు ఏ శక్తీ లేదనీ కేవలం రాజులో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి అలా అబద్ధం చెబుతానని రాజుకు చెబుతాడు ప్రొఫెసరు. రాజు ఆ నాణేన్ని పక్కకు విసిరేసి తన స్వశక్తిని నమ్ముకుంటానని చెబుతాడు. మేఘమాల, రాజు పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
పంక్తి 54:
* కొ క్కొ కొబ్బరి బోండాం
* గంగిగోవు లాంటి వాణ్ణి
* చల్ల చల్లని గాలుల్లో
 
== మూలాలు ==
పంక్తి 60:
 
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు