"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

ఈ విషయం తెలియని సముదాయ సభ్యులకు ప్రయోజనకరంగా ఉంటుందని రాస్తున్నాను. మరో సంగతి.. అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తే ఈ లింకు దానంతటదే చేరిపోతుంది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:51, 18 సెప్టెంబరు 2020 (UTC)
: చదువరి గారు, మంచి పాయింటు. నేను ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే ఇది. కానీ నాకు తెలుసు కాబట్టి అందరికీ తెలియాలని నియమమేమీ లేదు. ఇలా మనకు తెలిసిన విషయాలు, ''అందరికీ తెలిసుంటుందిలే'' అనుకోకుండా ఇలా పంచుకుంటే తెలియని కొద్ది వాళ్ళకి కూడా మన ట్రిక్కులు తెలియజేసినట్లుంటుంది. నేను కూడా ఇలాంటి విషయాలన్నీ గుర్తు చేసుకుని రాస్తాను. ముఖ్యంగా వికీ డేటా, వికీపీడియా పేజీలకు ఉన్న సంబంధం గురించి. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 06:00, 18 సెప్టెంబరు 2020 (UTC)
::[[User:Chaduvari|చదువరి]] గారూ, [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ మీకు తెలియనితెలియవని కాదు.తెలియని వారు తెలుసుకుంటారు అనే భావనతో నేను చేస్తున్నవి, నాకు తెలిసినవి చెపుతున్నాను.వికీ డేటాకు లింకు లేని లేదా ఇవ్వని పేజీలు నేను ఎక్కువుగా మొలకలు విస్తరణలో గమనించాను.నేను విస్తరించిన వ్యాసాలుకు లింకులు కలపటమే కాకుండా, కొన్ని పేజీలుకు ఒక పనిగా పెట్టుకుని ఆంగ్ల వ్యాసాల వికీడేటాకు లింకులు కలిపాను.ఇందులో ఏ రకాలు ఏ విధంగా ఏర్పడుతున్నవి అనేదానిని నాకు తెలిసినంతవరకు వివరిస్తున్నాను.
* ఆంగ్ల వ్యాసంతో సంబంధం లేకుండా కొత్త వాడుకరులు కొత్తగా సృష్టించే వ్యాసాలుకు ఎక్కువుగా ఉంటున్నవి.
* కొద్దిగా అవగాహన ఉన్నవారు ఆంగ్ల వ్యాసం ఎంచుకుని, అందులో ఆంగ్లసమాచారంను గోగుల్ ట్రాన్సులేట్, లేదా డైరెక్టుగా సృష్టించిన పేజీలో ఆంగ్ల సమాచారం నింపి, అనువాదం చేసి ఆంగ్ల పాఠ్యం తొలగించి, ఆంగ్ల వ్యాసానికి వికీ డేటా లింకు కలుపకుండా దీనికి కొత్త వికీడేటా లింకు ఇవ్వటం, లేదా ఎటువంటి లింకు ఇవ్వకుండా వదిలి వేస్తున్నారు.
* మరి కొన్ని సందర్బాలలో తెవికీలో సవరణలు చేసేటప్పుడు వికీ డేటా లింకు లేని వ్యాసాలు గమనించి, ఆంగ్ల వ్యాసం ఉందా, లేదా అని గమనించకుండా కొత్తగా వికీ డేటా లింకు ఇస్తున్నారు. దాని వలన వికీ డేటాలో రెండు లింకులు ఉంటున్నవి.
'''పై వాటికి ఎలా పరిష్కరించాలి అనే దానికి వస్తే'''
పై వాటికి ఎలా పరిష్కరించాలి అనే దానికి వస్తే గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటతొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమంయలోసమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు, నేను వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చేప్పాననిచెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన అయితేకలిగితే సంతోషిష్తాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3035311" నుండి వెలికితీశారు