మనీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జె.డి.చక్రవర్తి సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 6:
image = మనీ (సినిమా).jpg|

director = [[ శివనాగేశ్వరరావు ]]|

year = 1993|
పంక్తి 16:
music = [[శ్రీ]]|

starring = [[బ్రహ్మానందం]]
[[ జయసుధ]]
[[పరేష్ రావల్]]
[[కోట శ్రీనివాసరావు]]
[[జె.డి.చక్రవర్తి]]
[[చిన్నా]]
[[రేణుకా సహాని]]|
producer = [[రామ్ గోపాల్ వర్మ]]

'''మనీ''' [[శివనాగేశ్వరరావు]] దర్శకత్వంలో, [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. [[జె. డి. చక్రవర్తి]], [[చిన్నా]] కథానాయకులుగా, [[జయసుధ]], [[పరేష్ రావెల్]], [[కన్నెగంటి బ్రహ్మానందం]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా ''రూత్ లెస్ పీపుల్'' సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. సినిమా నిర్మాణం తర్వాత ఎంతమంది పంపిణీదారులకు ప్రివ్యూ వేసినా నచ్చకపోతూండడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఏదో విధంగా తుదకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి [[మనీ మనీ]] (1995), [[మనీ మనీ మోర్ మనీ]] (2011) సినిమాలు సీక్వెల్స్‌గా, "''లవ్ కే లియే కుఛ్ బీ కరేగా''" (2001) హిందీ రీమేక్‌గా వచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన [[ఖాన్ దాదా]] పాత్ర బ్రాండ్ స్థాయికి ఎదిగింది. 1993 నంది పురస్కారాల్లో ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు (శివనాగేశ్వరరావు), ఉత్తమ హాస్య నటుడు (బ్రహ్మానందం) పురస్కారాలు మనీ సినిమాకు దక్కాయి.

== కథ ==
నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులు చక్రి (జె.డి.చక్రవర్తి), బోస్ (చిన్నా) తమ ఇంటి పక్క బంగాళాలో ఉండే కోటీశ్వరురాలు విజయ(జయసుధ)ని కిడ్నాప్ చేస్తారు. ఆమె ఆస్తి కోసం ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) బయటకి ఆమె కిడ్నాప్ అయినందుకు బాధపడ్డా, లోలోపల అక్కడే చంపేయాలని ప్రయత్నాలు సాగిస్తాడు. దీంతో చక్రి, బోస్ కలిసి విజయను రక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చివరకు విజయకు సుబ్బారావు నిజస్వరూపాన్ని తెలియబరచడంతో, ఆమె కంపెనీలోనే వారిద్దరికీ ఉద్యోగం వస్తుంది.

== తారాగణం ==
పంక్తి 52:

== ప్రాచుర్యం, పురస్కారాలు ==
[[దస్త్రం:Brahmanandam_addressing_in_WTC_2017.png|thumb|మనీలో బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర సినిమా విజయంలో, అతని కెరీర్‌లో కీలకమైన సినిమా అయింది. ]]
ఈ సినిమాలో [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] నటించిన [[ఖాన్ దాదా]] పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొంది బ్రాండ్ స్థాయికి ఎదిగింది. మనీ సినిమా విజయానికే కాక తదనంతరం సీక్వెల్స్ నిర్మాణానికి కూడా ఖాన్ దాదా పాత్ర కీలకమైన ఆకర్షణగా నిలిచింది.<ref name="Brand Money">{{cite book|url=https://books.google.com/books?id=aFJuDwAAQBAJ&pg=PA916|title=Brand Culture and Identity: Concepts, Methodologies, Tools, and Applications: Concepts, Methodologies, Tools, and Applications|last=రాసు|first=ఛత్రపతి యాదవ్|date=5 October 2018|publisher=IGI Global|year=|isbn=978-1-5225-7117-9|editor=Management Association, Information Resources|location=|page=916|pages=|language=English|chapter=Space of Culture and Brand in Sequel of Telugu Films: A Qualitative Study}}</ref> సీరియస్‌గా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించే ఖాన్ దాదా పాత్ర బ్రహ్మానందం కెరీర్‌లోని మేలిమలుపుల్లో ఒకటిగా నిలిచి,<ref name="Money money more money The Hindu">{{cite news|url=https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|title=It's a mad mad comedy|last1=Narasimham|first1=M. l|date=22 August 2011|work=The Hindu|accessdate=15 January 2019|language=en-IN|archiveurl=https://web.archive.org/web/20190115062932/https://www.thehindu.com/features/metroplus/its-a-mad-mad-comedy/article2383392.ece|archivedate=15 January 2019}}</ref> ఉత్తమ హాస్య నటుడిగా తొలి నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

పంక్తి 76:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}

[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
[[వర్గం:జె.డి.చక్రవర్తి సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మనీ_(సినిమా)" నుండి వెలికితీశారు