బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 84:
 
==భేతాళ పంచవింశతి – పాఠాంతరాలు, సంకలనాలు, అనువాదాలు==
భేతాళుడు చెప్పిన 25 కథలు కాబట్టి దీనికి భేతాళ పంచవింశతి అనే పేరు వచ్చింది. అత్యంత ప్రాచీనమైన ఈ కథలు తరువాత కాలంలో గ్రంధస్తం చేయబడ్డాయి. బేతాళ పంచవింశతి యొక్క సంస్కృత మూల గ్రంథం అలభ్యం. దీనికి రెండు సంస్కృత పాఠంతరాలు లభ్యం అవుతున్నాయి. అవి 1) [[క్షేమేంద్రుడు|క్షేమేంద్రుని]] విరచితమైన బృహత్కథామంజరి 2) సోమదేవసూరి విరచితమైన ‘కథాసరిత్సాగరం’ ఈ రెండింటిలోనూ 25 బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి. దీనికి సంస్కృతంలో మరో రెండు ప్రధాన పాఠంతరాలు లభ్యం అవుతున్నాయి. అవి 1) శివదాస (చంపూ మార్గంలోనిది) 2) జంభలదత్తు (గద్యరూపం లోనిది) వీటిలో కూడా 25 కథలు వున్నాయి. వల్లభదేవుడు భేతాళకథలను సంక్షిప్త రూపంలో మార్చాడు.
 
భారతదేశంలో భేతాళ కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి.<ref>Penzer 1924, Vol VI, p 225.</ref> సంస్కృత పాఠాంతరాలతో పాటు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషలలోని అనువాదాల ఆధారంగా అనేక ఇంగ్లీష్ అనువాదాలు ప్రచురించబడ్డాయి. <ref>Penzer 1924, Vol VI, p 226.</ref> 1855 లో, విలియం బర్క్‌హార్డ్ట్ బార్కర్ దీనిని బైటాల్ పచ్చీసి (25 టేల్స్ అఫ్ ఎ డెమన్) పేరుతొ ఇంగ్లీషులో అనువదించాడు.<ref>{{cite book |last1=William Burckhardt |first1=Barker |title=Baital Pachísí ; or, Twenty-five tales of a demon |publisher=Hertford : Stephen Austin |location=Eton |pages=385 |edition=1855 |url=https://archive.org/details/bub_gb_zX0IAAAAQAAJ/page/n1/mode/2up |accessdate=13 September 2020}}</ref> 1873 లో హెర్మాన్ ఓస్టర్లీ ఈ కథలను జర్మనీ భాషలోకి అనువదించాడు.<ref>{{cite book |last1=Oesterley |first1=Hermann |title=Baitál Pachísí: Oder, die fünfundzwanzig Erzählungen eines Dämon |publisher=Friedrich Fleischer |location=Leipzig, Germany |pages=278 |edition=1873 |url=https://archive.org/details/baitlpachsoderd00oestgoog/page/n7/mode/2up |accessdate=13 September 2020}}</ref> ఇంగ్లీష్ అనువాదాలలో 1870 లో సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ చేసిన అనువాదం (విక్రమ్ అండ్ ది వాంపైర్) బాగా ప్రసిద్ధి పొందింది. <ref>{{cite book |last1=Burton |first1=Sir Richard F. |title=Vikram and the Vampire |publisher=Longmans, Green and Co |location=London |edition=1870 |url=https://www.gutenberg.org/files/2400/2400-h/2400-h.htm#link2H_PREF |accessdate=13 September 2020}}</ref>ఈ అనువాదానికి మూలం హిందీ నుండి తీసుకున్నప్పటికీ, ఇది అనువాదంలా కాకుండా సృజనాత్మక అనుసరణగా ఉంటుంది.<ref>Penzer 1924, Vol VI, p 227. Penzer goes on to observe "What Burton has really done is to use a portion of the Vetāla tales as a peg on which to hang elaborate 'improvements' entirely of his own invention."</ref>
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు