వారసురాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
|}
==కథాసంగ్రహం==
జమీందారు చక్రవర్తి కూతురు మాలతి తండ్రిని ఎదిరించి తను మనసిచ్చిన మనిషితో పెళ్ళి చేసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోతుంది. ఒక్కగానొక్క బిడ్డకు దూరమైన చక్రవర్తి ఆత్మీయతకోసం అలమటించసాగాడు. పట్టుదలతో ఇల్లు విడిచిన మాలతి దురదృష్ట వశాన భర్తను కోల్ఫోయింది. కన్నబిడ్డ శోభను దిక్కులేనిదానిగా చేసి తనూ కన్ను మూసింది. లక్షలాది ఆస్తికి వారసురాలైన ఆ చిన్నారిపాప, ఒక దయామయుడి నీడలో పెరిగి పెద్దదయ్యింది. తనను పెంచి పెద్దచేసిన ఆ పేద కుటుంబంకోసం కష్టపడుతూ ఆ కుటుంబానికి ఎన్నో సేవలు చేసింది. శోభ, జమీందారు చక్రవర్తి కళ్ళముందు పరిచితులుగా తాతగారని శోభ, తన మనవరాలని జమీందారు గుర్తించుకోలేకపోతారు. అయినా ఏదో తెలియని అనుబంధం, ఆ ఇద్దర్నీ హృదయాలను స్పందింపచూస్తుంది. చక్రవర్తి తమ్ముడు కొడుకు రమేష్ ఆస్తికి వారసుడు కావాలని శోభను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. తనెవరో తెలియకున్నా సంబంధం లేకపోయినా శోభను అడుగడుగునా కాపాడుతుంటాడు రత్తిగాడు. అతడు గతంలో ఒక యువతిని మానభంగం చేసి జైలుకెళ్ళి వచ్చాడు. శోభ అడుగడుగునా అపాయాలు తప్పించుకుంటూ ఆశయసిద్ధికోసం పాటుపడుతూ, చివరికి తాతగారైన చక్రవర్తిని కలుసుకుంటుందా? ఆమెకు ప్రాణరక్షణ చేస్తున్న రౌడీ రత్తిగాడు ఎవరు? అతని ఆశయమేమిటి? లక్షలాది ఆస్తికి వారసులు ఎవరు? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాకసన్నివేశంలో తెలుస్తుంది<ref name="పాటల పుస్తకం" />.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వారసురాలు" నుండి వెలికితీశారు