వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,227:
గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన కలిగితే సంతోషిష్తాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
::: నేను ఏదన్న కొత్త వ్యాసం రాసేముందు ఆ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఉందోలేదో, ఉంటే ఆ వ్యాసంకి తెవికీ వ్యాసం లింకు ఉందోలేదో పరిశీలుస్తూ ఉంటాను. చాలావాటికి లింక్స్ ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యాసం తెవికీలో లేదనుకుంటాం. వికీ ఛాలెంజ్ లో భాగంగా రెండుమూడుసార్లు వ్యాసాలు రాసి, ఆ వ్యాసాలకు సంబంధించిన పేజీల్లో లింక్స్ ఇచ్చే సమయంలో అక్షర బేధాలతో ఆయా వ్యాసాలు కనిపించాయి. అప్పుడు ఆ పేజీ తొలగించి మళ్ళీ మరో వ్యాసం రాయాల్సివచ్చింది. చాలామంది వ్యాసం రాయగానే పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ, వ్యాసం రాయడంతోపాటు వ్యాసానికి సంబంధించిన ఇతర పనులు చేయడం (ఎన్వికీ లింకులు, అంతర్వికి లింకులు, వర్గాలు, మూలాలు, సమాచారపెట్టె, ఫోటో) కూడా చాలా ముఖ్యం.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 08:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
తెలుగుకు లేదా మన ప్రాంతాలకు సంబంధించిన ఇంగ్లీష్ వ్యాసాలలో పూర్తి సమాచారం లేకపోవటం, అనవసరం అయిన సమాచారం ఉండటం నేను గమనించాను, ప్రస్తుతానికి అంతర్జాలంలో తెలుగులో ఉన్న వనరులతో లేదా ఆయా వ్యాసము మూలం లో ఇంగ్లీష్ వచనం తెలుగులోని అనువదించి రాస్తున్నాను, భవిషత్తులో యాత్రిక అనువాదాలు జరిగి వ్యాసం విలీనం అయినా మనము ఇక్కడ బిన్నంగా రాసింది ఇతరులకు ఉపయోగ పడుతుందేమో అన్న ఆలోచన , ఆంగ్ల వ్యాసానికి నకలు గా తెలుగులోను వ్యాసం ఉండాలన్న [[:en:Help:Interlanguage_links|నింబంధన]] నా దృష్టికి రాలేదు ఆయితే దీని మీద తెలుగులో కూడా ఒక మార్గదర్శకం ఉంటే బాగుంటుంది అని నా విన్నపము , శీర్షికలకు వికీడేటా లో సవరణలు / బాట్ లు బాగానే చేరుస్తున్నాయి [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 17:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు